బీహార్ సీఎంగా నితీష్ కుమార్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ఇరువురు నేతలకు ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలోనే రేపు బీహార్‌కు వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేశారు అధికారులు.
రేపు ఉదయం 8 గంటలకుముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ విజయవాడ నుంచి పాట్నాకు బయల్దేరి వెళ్తారు. ఉదయం 10.20 నిముషాలకు పాట్నాలోని గాంధీ మైదాన్ లో బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు ఇరువురు నేతలు. అనంతరం మద్యాహ్నం 1 గంటకు పాట్నాలో బయల్దేరి 3 గంటలకు అమరావతికి తిరిగి వస్తారు.