చాందీపురా వైరస్ కలకలం.. 8 మంది మృతి
గుజరాత్‌లో చాందీపురా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 15 కేసులు నమోదు కాగా, 8 మంది మృతి చెందారని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.
By అంజి Published on 17 July 2024 6:40 AM ISTచాందీపురా వైరస్ కలకలం.. 8 మంది మృతి
గుజరాత్‌లో చాందీపురా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. వైరస్ సంక్రమణతో మరో ఇద్దరు పిల్లలు మరణించారు. ఇప్పటి వరకు 15 కేసులు నమోదు కాగా, 8 మంది మృతి చెందారని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రిషికేష్ పటేల్ రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌లో విలేకరులతో తెలిపారు. ఇతర జిల్లాల నుండి కొత్త కేసులు నమోదయ్యాయి. రోగుల బ్లడ్ శాంపిల్స్‌ను పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్టు పేర్కొన్నారు. చండీపురా వైరస్‌ను ముందస్తుగా గుర్తించి చికిత్స చేయడంలో నిఘా పెంచడం చాలా కీలకమని వైద్యులు మంగళవారం తెలిపారు.
చాందీపురా వైరస్ అనేది ఒక రకమైన ఆర్బోవైరస్, ఇది రాబ్డోవిరిడే కుటుంబానికి చెందిన వెసిక్యులర్ వైరస్ జాతికి చెందినది. ఇది ప్రధానంగా ఫ్లెబోటోమైన్ శాండ్‌ఫ్లైస్ ద్వారా, కొన్నిసార్లు పేలు , దోమల ద్వారా వ్యాపిస్తుంది. పిల్లలు ఈ వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు తెలిపారు. బాధితుల్లో జ్వరం, మెదడువాపు, ప్లూ లక్షణాలు కనిపిస్తాయి. 1965లో మహారాష్ట్రలోని చాందిపురలో ఈ వైరస్‌ను గుర్తించడంతో అదే పేరు పెట్టారు.
"దీని లక్షణాలలో అకస్మాత్తుగా అధిక-స్థాయి జ్వరం, విరేచనాలు, వాంతులు, మూర్ఛలు, మార్చబడిన సెన్సోరియం ఉన్నాయి, ఇది లక్షణాలు ప్రారంభమైన 24 నుండి 72 గంటల్లో చివరికి మరణానికి దారి తీస్తుంది," డాక్టర్ శ్రేయా దూబే, కన్సల్టెంట్ - నియోనాటాలజీ మరియు పీడియాట్రిక్, గురుగ్రామ్‌లోని సీకే బిర్లా హాస్పిటల్ ఐఏఎన్‌ఎస్‌కి చెప్పారు. ప్రస్తుతం, చాందీపురా వైరస్‌కు వ్యతిరేకంగా నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్సలు లేదా వ్యాక్సిన్‌లు లేవు.