పాన్‌-ఆధార్ అనుసంధానం గ‌డువు పొడిగింపు

Centre extends PAN Aadhaar linking deadline.పాన్‌ కార్డుకు ఆధార్ అనుసంధానం చేసే గ‌డువు సెప్టెంబ‌ర్ 30వ తేదీతో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Sep 2021 4:16 AM GMT
పాన్‌-ఆధార్ అనుసంధానం గ‌డువు పొడిగింపు

పాన్‌ కార్డుకు ఆధార్ అనుసంధానం చేసే గ‌డువు సెప్టెంబ‌ర్ 30వ తేదీతో ముగుస్తోంద‌ని మీరు ఒత్తిడికి గురికాన‌వ‌స‌రం లేదు. కేంద్ర ప్ర‌భుత్వం మీకు ఓ శుభ‌వార్త చెప్పింది. పాన్‌కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేసే తుది గ‌డువును మ‌రో ఆరు నెల‌లు కేంద్రం పొడిగించింది. మార్చి 31, 2022 వరకు పొడిగిస్తున్న‌ట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) ప్ర‌క‌టించింది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌జ‌ల‌ ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది. ఐటీ చట్టంలో భాగంగా పెనాల్టీ ప్రొసీడింగ్స్‌కు కూడా గడువును మార్చి 31 వరకు పొడిగించారు.

ఆర్థిక లావాదేవీల్లో పాన్ కీల‌కం..

బ్యాంకు ఖాతాలు తెరవడం, బ్యాంకు ఖాతాలో నగదు డిపాజిట్‌ చేయడం, డీమ్యాట్‌ ఖాతా తెరవడం, స్థిరాస్తుల లావాదేవీ, సెక్యూరిటీలలో లావాదేవీలు వంటి ఆర్థిక లావాదేవీల కోసం పాన్‌ కార్డు తప్పనిసరి. కాగా.. పాన్‌కార్డుకు ఆధార్‌తో అనుసంధానం గ‌డువ‌ను కేంద్రం ప్రభుత్వం ఇప్ప‌టికే ప‌లుమార్లు పొడిగించింది. చివరిగా ఈ నెలాఖరుతో గడువు పూర్తి అవుతుండ‌గా.. వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది మార్చి నెల వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గ‌డువులోగా మీరు పాన్‌తో ఆధార్ అనుసంధానం చేయ‌కుంటే.. మీ పాన్‌కార్డు చెల్ల‌బాటు కాదు. చెల్ల‌ని పాన్‌కార్డుతో లావాదేవీలు జ‌రిపిన‌ట్లు అయితే.. మీరు భారీగా జ‌రిమానా చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల ఇప్ప‌టికి మీరు ఇంకా లింక్ చేసుకోకపోతే వెంటనే రెండింటినీ అనుసంధానం చేసుకోండి.

Next Story