కార్మికులకు, ప్రత్యేకించి అసంఘటిత రంగంలో ఉపాధి పొందుతున్న కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసంఘటిత రంగం (ఆన్‌ఆర్గనైజ్డ్)లో పని చేసే వర్కర్లకు వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్ రివైజ్ చేసి కనీస వేతనాన్ని పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సర్దుబాటు కార్మికులకు పెరుగుతున్న జీవన వ్యయాన్ని ఎదుర్కోవడంలో సహాయపడనుంది. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త వేతన రేట్లు అమల్లోకి వస్తాయంది. నిర్మాణ, పారిశుద్ధ్య కార్మికులు, హమాలీలు, మైనింగ్ వర్కర్లకు లబ్ధి చేకూరనుంది.
హైస్కిల్డ్ వర్కర్లకు రోజుకు రూ.1,035, సెమీ స్కిల్డ్ రోజుకు రూ.868, ఆన్ స్కిల్డ్ వర్కర్లకు రోజుకు రూ.783 చెల్లించాలంది. భవన నిర్మాణం, లోడింగ్, అన్‌లోడింగ్, వాచ్ అండ్ వార్డ్, స్వీపింగ్, క్లీనింగ్, హౌస్ కీపింగ్, మైనింగ్, సెంట్రల్ స్పియర్ సంస్థలలో వ్యవసాయం వంటి వివిధ రంగాలలో నిమగ్నమైన కార్మికులు సవరించిన వేతన రేట్ల నుండి ప్రయోజనం పొందుతారు. కొత్త వేతన రేట్లు అక్టోబర్ 1, 2024 నుండి అమలులోకి వస్తాయి. చివరి సవరణ ఏప్రిల్ 2024లో జరిగింది.