రైతుల‌కు శుభ‌వార్త చెప్పిన కేంద్ర‌ప్ర‌భుత్వం

Central government tells good news to farmers.కేంద్ర‌ప్ర‌భుత్వం రైతుల‌కు శుభవార్త చెప్పింది. రైతుల‌కు ఆర్థిక సాయం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 May 2021 10:54 AM GMT
former financial help

కేంద్ర‌ప్ర‌భుత్వం రైతుల‌కు శుభవార్త చెప్పింది. రైతుల‌కు ఆర్థిక సాయం చేసేందుకు మోదీ స‌ర్కార్ పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధి అనే ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌థ‌కం కింద రైతుకు ప్ర‌తి సంవ‌త్స‌రం రూ.6వేలు అందించ‌నున్నారు. అయితే.. రూ.6వేల‌కు ఒకే సారి కాకుండా 3 విడుత‌ల్లో రూ.2వేల చొప్పున రైతుల ఖాతాలో డిపాజిట్ చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏడు విడ‌త‌లుగా నిధుల‌ను విడుద‌ల చేశారు. తాజాగా ఇప్పుడు ఎనిమిదో విడుత ఆర్థిక సాయాన్ని ఎప్పుడు విడుద‌ల చేయ‌నుంది ప్ర‌క‌టించారు.

మే 14 న ఉద‌యం 11 గంట‌ల‌కు రైతుల ఖాతాల్లో న‌గ‌దును విడుద‌ల చేస్తామ‌ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా 9.5 కోట్ల రైతు కుటుంబాలకు రూ.19,000 కోట్ల సాయం అందుతుందన్నారు.

మీరు న‌గ‌దు వ‌స్తుందో లేదో ఇలా తెలుసుకోవ‌చ్చు..

రైతులు పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి డబ్బులు వచ్చాయా? లేదా చెక్‌ చేసుకోవచ్చు. ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ https://pmksan.gov.in/ ను సందర్శించాలి. ఆ తర్వాత మీకు ఫార్మర్స్ కార్నర్ సెక్షన్ లో కనిపించే బెనిఫీసియరీ లిస్ట్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాలను ఎంటర్ చేసి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.


Next Story