ఉద్యోగులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్.. ఆలస్యంగా వస్తే..
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించింది.
By Srikanth Gundamalla Published on 17 Jun 2024 2:30 AM GMTఉద్యోగులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్.. ఆలస్యంగా వస్తే..
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించింది. ఈ మేరకు కీలక ఆదేశాలను జారీ చేసింది. కార్యాలయాలకు ఆలస్యంగా వస్తుండటంతో పాటు ఇతర అంశాలనూ ప్రస్తావిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయానికి తరచూ ఆలస్యంగా వస్తూ.. నిర్ణీత పనివేలలు ముగియక ముందే వెళ్లిపోతున్న విషయాన్ని కేంద్రం గుర్తించి సీరియస్‌గా స్పందించింది. ఇకపై ఆఫీసులకు ఆలస్యంగా వస్తే పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. సంబంధిత అధికారులు కఠినంగా వ్యవహించాలని సిబ్బంది మంత్రిత్వ శాఖ ఆదేశాలను జారీ చేసింది.
మరోవైపు ఆధార్‌తో అనుసంధానమైన బయోమెట్రిక్ వ్యవస్థలో పలువురు ఉద్యోగులు హాజరును నమోదు చేయడం లేదని ప్రభుత్వం పేర్కొంది. మారికొందరు తరచూ ఆలస్యంగా వస్తున్నట్లు గుర్తించి ఈ ఆదేశాలు జారీ చేసింది. మొబైల్ ఫోన్ ఆధారిత ఫేస్ రికగ్నిషన్‌ను వాడి ఉద్యోగులు ఎక్కడ ఉన్నారో గుర్తించగలిగేలా చేయొచ్చని సూచించింది. అన్ని విభాగాలు, శాఖలు, సంస్థలు తరచూ తమ ఉద్యోగుల హాజరు నివేదికలను పర్యవేక్షించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. ఆలస్యంగా వచ్చిన ఒక్కోరోజుకి ఒకపూట సీఎల్ చొప్పున కోతపెట్టాలని సూచించింది. ఒకవేళ సీఎల్‌లు లేకపోతే ఆర్జిత సెలవుల నుంచి తగ్గించాలని చెప్పింది.
ఇక ఆలస్యానికి తగిన కారణాలు ఉంటే మాత్రం నెలలో గరిష్టంగా రెండుసార్లు, రోజుకు గంట సమయానికి మించి ఆలస్యంగా రావడానికి అవకాశం ఇవ్వొచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇక అంతకు మించి ఆలస్యం తగు చర్యలు తీసువాలని కేంద్ర ప్రభుత్వం వివరించింది. ఈ మేరకు ఉత్తర్వులను కూడా జారీ చేసింది.