కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఆగస్టు 2025 నుంచి దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితాను సునిశితంగా పరిశీలించనున్నట్లు ప్రకటించింది. తప్పుడు, డూప్లికేట్ ఓటర్ల తొలగింపు లక్ష్యంగా ఈ సవరణ చేపట్టనున్నారు. బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ నుంచి విదేశీ అక్రమ ఓటర్ల గుర్తించనున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశ వ్యాప్తంగా ఈ సమీక్ష అమలు చేయనున్నట్లు ఈసీ ప్రకటించింది.
ఆధార్, ఓటర్ కార్డు, రేషన్ కార్డు ఆధారంగా ఓటర్లను ధ్రువీకరించనున్నారు. ఓటర్ల నకిలీ నమోదు చేసిన వారిపై చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారుల సమన్వయంతో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో కచ్చితమైన ఓటర్ లిస్టు కోసం కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోనుంది. ఎన్నికల ముందు ఓటర్ల జాబితాలో పారదర్శకతను పెంచే దిశగా కార్యాచరణ చేపట్టనుంది. ప్రజల ఓటర్ల జాబితాపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను కూడా ఏర్పాటు చేయనుంది.