కేంద్ర కేబినెట్ పునర్విభజన.. ట్విట్ట‌ర్ ప్రొఫైల్‌ను మార్చేసిన కిర‌ణ్ రిజిజు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. మంత్రులు కిరణ్‌ రిజిజు, అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ల

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 18 May 2023 1:15 PM IST

Central cabinet reshuffle, Union Minister Kiran Rijiju,  Twitter profile, National news

కేంద్ర కేబినెట్ పునర్విభజన.. ట్విట్ట‌ర్ ప్రొఫైల్‌ను మార్చేసిన కిర‌ణ్ రిజిజు 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. మంత్రులు కిరణ్‌ రిజిజు, అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ల పోర్టుఫోలియోలు మార్చేశారు. కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి ప‌ద‌వి నుంచి కిర‌ణ్ రిజిజును తొల‌గించారు. ఆయ‌న స్థానంలో ఆ శాఖ‌కు అర్జున్ రామ్ మేఘ‌వాల్‌ను నియ‌మించారు. న్యాయ‌శాఖ‌ను కోల్పోయిన రిజిజుకు ఇప్పుడు ఎర్త్ సైన్సెస్ శాఖ‌ను కేటాయించారు. పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన అర్జున్ రామ్ మేఘవాల్‌కు కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి పదవిని కట్టబెట్టారు. పార్ల‌మెంట్ వ్య‌వ‌హారాల శాఖ స‌హాయ మంత్రిగా ఉన్న అర్జున్ రామ్ మేఘ‌వాల్ ఇప్పుడు న్యాయ శాఖ బాధ్య‌త‌ల‌ను కూడా చేప‌ట్ట‌నున్నారు. రాష్ట్ర‌ప‌తి కార్యాల‌యం ఇవాళ ఉద‌యం ఈ మార్పుపై ఓ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. మంత్రి కిర‌ణ్ రిజిజు కూడా త‌న ట్విట్ట‌ర్ ప్రొఫైల్‌ను కూడా మార్చేసుకున్నారు.

Next Story