కేంద్రప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంట్‌లో ప్రకటన చేసింది. ఎంపీ దయానిధి మారన్ వేసిన ప్రశ్నకు లోక్‌సభలో సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇకపై ఓటర్ ఐడీకి ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేస్తామని తెలిపారు. ఓటర్ ఐడీ- ఆధార్ అనుసంధానం పూర్తైతే ఎవరు ఎక్కడ ఓటేశారో తెలుసుకోవచ్చని తెలిపారు. ఓటు హక్కు పరిరక్షణకకు ఇది దోహదపడుతుందన్నారు.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికి ఒకరిపై అనేక ఓటర్ కార్డులుండడం బయటపడుతూనే ఉన్నాయి. ఇంకోవైపు తమ ఓటు గల్లంతు అయ్యందంటూ ఆందోళన వ్యక్తం చేసేవారు లేకపోలేదు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఎన్నికల సంఘానికి ఇదో పెద్ద తలనొప్పింగా మారింది. ఎన్ని చర్యలు చేపట్టినా ఈసీ బోగస్ కార్డులను నియత్రించలేకపోతోంది. అయితే.. బోగస్ కార్డులను అరికట్టేందుకు ఓటర్ గుర్తింపు కార్డులను ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేయాలని ఇప్పటికే న్యాయ శాఖకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఓటర్ కార్డును ఆధార్ తో లింక్ చేయడం వల్ల నకిలీ దరఖాస్తులు బోగస్ ఓట్లను సులభంగా తీసేయొచ్చనని పేర్కొంది. ఈ రోజు లోక్‌సభలో కేంద్రమంత్రి ప్రకటన చూస్తే.. ఓటర్ ఐడీకి ఆధార్ అనుసంధానం తప్పనిసరి కానుంది.