ఓటేసిన ప్ర‌ముఖులు

Celebrities cast their vote.దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర ప్రాంతం అసెంబ్లీల ప‌రిధిలో మంగ‌ళ‌వారం ఎన్నిక‌ల పోలింగ్ కొన‌సాగుతోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 April 2021 10:45 AM IST
celebraties cast their vote

దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర ప్రాంతం అసెంబ్లీల ప‌రిధిలో మంగ‌ళ‌వారం ఎన్నిక‌ల పోలింగ్ కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు పోలింగ్ కేంద్రాల‌కు వెళ్లి త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటర్లంద‌రూ త‌మ ఓటు వేసి బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించాల‌ని వారు విజ్ఞ‌ప్తి చేశారు.

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తౌజండ్ లైట్స్ నియోజ‌క‌వ‌ర్గంలోని స్టెల్లా మేరిస్ క‌ళాశాల పోలింగ్ కేంద్రానికి వెళ్లి త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.


మ‌క్క‌ల్ నీది మ‌య్య‌య్‌(ఎంఎన్ఎం) అధినేత క‌మ‌ల్‌హాస‌న్‌, త‌న ఇద్ద‌రు కుమారైలు శృతిహాస‌న్‌, అక్ష‌ర‌ల‌తో క‌లిసి తేనంపేట‌లోని చెన్నై సూల్క్ పోలింగ్ కేంద్రంలో ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.


ఇక తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌, పుదుచ్చేరి ఇంచార్జి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర‌రాజ‌న్ విరుకాంబ‌క్కంలోని పోలింగ్ కేంద్రానికి ఉద‌యాన్నే చేరుకుని క్యూ లైన్‌లో నిలుచుని త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.


త‌మిళ సినీ న‌టులు విజ‌య్‌, సూర్య‌, కార్తి త‌దిత‌రులు ఉద‌యాన్నే త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. విజ‌య్ సైకిల్‌పై పోలింగ్ కేంద్రానికి వ‌చ్చి ఓటు వేయ‌డం విశేషం. అజిత్ త‌న స‌తీమ‌ణి షాలినీతో క‌లిసి ఓటు వేశారు.





Next Story