సీబీఎస్‌ఈ 10, 12 పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసిన కేంద్ర మంత్రి

CBSE Board Class 10, 12 Exam Date Sheet. సెంట్రల్‌ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 10,12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌

By Medi Samrat  Published on  2 Feb 2021 2:38 PM GMT
CBSE Board Class 10, 12 Exam Date Sheet

సెంట్రల్‌ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 10,12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. 2021 ఏడాదికి గానూ 10,12వ తరగతుల పరీక్షల టైం టేబుల్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోక్రియాల్‌ మంగళవారం ప్రకటించారు. మే 4వ తేదీ నుంచి జూన్‌ 10 వరకు పరీక్షల నిర్వహణ జరుగనున్నట్లు ఆయన వెల్లడించారు. మే 4 నుంచి జూన్‌ 7 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే మే 4వ తేదీ నుంచి జూన్‌ 11 వరకు 12వ తరగతి పరీక్షల నిర్వహణ ఉంటుందని తెలిపారు. మార్చి 1 నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు, జులై 15లోగా సీబీఎస్‌ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. బోర్డు పరీక్షల కసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న డేట్‌ షీట్‌ వచ్చేసిందన్నారు. పరీక్షల పూర్తి షెడ్యూల్‌ కోసం సీబీఎస్‌ఈ అధికార వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన సూచించారు.

Next Story
Share it