షారుఖ్ ఖాన్ కొడుకును అరెస్ట్ చేసిన అధికారిపై కేసు న‌మోదు

CBI Registers Corruption Case Against Officer Who Arrested Aryan Khan. రెండేళ్ల క్రితం క్రూయిజ్ షిప్ లో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ను అరెస్ట్ చేసిన యాంటీ నార్కోటిక్ అధికారి

By M.S.R  Published on  12 May 2023 3:09 PM GMT
షారుఖ్ ఖాన్ కొడుకును అరెస్ట్ చేసిన అధికారిపై కేసు న‌మోదు

రెండేళ్ల క్రితం క్రూయిజ్ షిప్ లో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ను అరెస్ట్ చేసిన యాంటీ నార్కోటిక్ అధికారి సమీర్ వాంఖడేపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శుక్రవారం అవినీతి కేసు నమోదు చేసింది. వాంఖడే ఆర్యన్ ఖాన్‌ను డ్రగ్స్ కేసులో ఇరికించనందుకు 25 కోట్ల రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో సమీర్‌ వాంఖడే, ఇతర అధికారులు లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఎన్సీబీ కోరింది. ఈ మేరకు ఎన్సీబీ లేఖ రావడంతో సీబీఐ రంగంలోకి దిగింది.

2021లో నగర తీరంలో క్రూయిజ్ షిప్‌పై దాడి చేసిన సమయంలో సమీర్ వాంఖడే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB, ముంబై జోనల్ చీఫ్‌గా ఉన్నారు. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ డ్రగ్స్ తీసుకున్నారంటూ NCB అప్పట్లో ఆరోపించింది. నాలుగు వారాల పాటు జైలులో గడిపాడు ఆర్యన్ ఖాన్. ఇక తగిన సాక్ష్యాలు లేనందున మే 2022లో ఆర్యన్ కు క్లీన్ చిట్ ఇచ్చారు.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) మాజీ జోనల్‌ అధికారి నివాసాలతోపాటు 28 ప్రాంతాల్లో రైడ్‌ చేసింది. మరో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఇద్దరు ప్రైవేట్‌ వ్యక్తులకు చెందిన ఢిల్లీ, ముంబై, కాన్పూర్, రాంచీలోని ఆస్తులను తనిఖీ చేసింది.


Next Story