ఎవ్వరూ టీ షర్ట్, జీన్స్ వేసుకోవద్దు..
CBI employees to wear only formals.సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష్ (సీబీఐ) కొత్త డైరెక్టర్ గా గతవారం నియమితులైన
By తోట వంశీ కుమార్ Published on 4 Jun 2021 11:04 AM GMTసెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష్ (సీబీఐ) కొత్త డైరెక్టర్ గా గతవారం నియమితులైన సుబోధ్ కుమార్ జైస్వాల్ పరిపాలనా విభాగంలో కొన్ని మార్పులకు పూనుకున్నారు. అధికారులు, సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి అధికారులు, ఇతర సిబ్బంది అందరూ కూడా ఫార్మల్ డ్రెస్సులే వేసుకుని రావాలని, జీన్స్ టీషర్ట్స్, స్పోర్ట్స్ షూలు వేసుకోకూడదని స్పష్టం చేశారు. ఈ ఆదేశాల ప్రకారం సీబీఐలో పని చేసే పురుషులు షర్ట్స్, ఫార్మల్ ప్యాంట్లు, ఫార్మల్ షూస్ వేసుకోవాలి. ప్రతి రోజూ నీట్‌గా షేవ్ చేసుకోవాల్సిందే.
ఇక మహిళా అధికారులు కూడా చీరలు, సాధారణ చొక్కాలు, సూటు, బూట్లు వేసుకుని మాత్రమే రావాలి. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సీబీఐ కార్యాలయాలు, శాఖలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. నిజానికి ఎప్పటి నుంచో ఇలాంటి డ్రెస్సింగ్ సీబీఐలో ఉన్నా.. గత కొన్నేళ్లుగా కొందరు క్యాజువల్స్ వేసుకోవడం ప్రారంభించారని, అయితే ఇన్ని రోజులూ వారిని ఎవరూ ప్రశ్నించలేదని ఓ సీబీఐ అధికారి అన్నారు. ఈ ఆదేశాలు ఒకరకంగా మంచివేనని అభిప్రాయపడ్డారు.
గత వారమే సీబీఐ 33వ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రధాని మోదీ, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌధరితో కూడిన కమిటీ సుభోధ్‌కుమార్‌ను ఈపదవికి ఎంపిక చేసింది. 1985 మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సుబోధ్‌కుమార్ రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉండనున్నారు. రానున్న రోజుల్లో సీబీఐ పనితీరును మెరుగుపరిచేందుకు సుబోధ్ కొన్ని కీలక చర్యలు తీసుకోనున్నట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.