రణతంబోర్ నేషనల్ పార్క్‌లోని టైగర్ రిజర్వ్‌లోకి ప్రైవేట్ వాహనాలు అక్రమంగా ప్రవేశించడంపై అధికారులు చర్యలు తీసుకున్నారు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని అటవీ శాఖ 19 ఎస్‌యూవీలను స్వాధీనం చేసుకుంది. ఇందులో రణతంబోర్ నేషనల్ పార్క్ జోన్ 8 నుండి 14, సమీపంలోని హోటళ్లకు చెందిన ఐదు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలకు రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర నంబర్ ప్లేట్లు ఉన్నాయి.
వర్షాకాలంలో జంగిల్ సఫారీ మూసివేసినప్పటికీ, ఆగష్టు 15 సాయంత్రం ఒక డజనుకు పైగా లగ్జరీ వాహనాలు రణథంబోర్ నేషనల్ పార్క్‌లోకి అడ్వెంచర్ టూర్ కోసం ప్రవేశించాయి. జంగిల్ సఫారీ కోసం జిప్సీలు, క్యాంటర్‌ల వంటి అధీకృత వాహనాలు మాత్రమే అనుమతిస్తూ ఉంటారు.. అయితే మహీంద్రా స్కార్పియో, థార్, XUV500 వేరియంట్‌లతో పలు కార్లు నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించాయి. పులి సంచారం ఉండే టైగర్ రిజర్వ్ లోపల కొందరు వ్యక్తులు నడుస్తున్నట్లు కూడా ఒక వైరల్ వీడియో చూపించింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అటవీ అధికారులు జోన్ 6- జోన్ 10 మధ్య ప్రైవేట్ వాహనాల కోసం వెతికారు. వారు జోన్ 8లో డజనుకు పైగా కార్లను కనుగొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.