భార‌త్‌లో థ‌ర్డ్‌వేవ్‌ అంచనాలపై డబ్ల్యూహెచ్ఓ రీజనల్ డైరెక్టర్ ఏం చెప్పారంటే..?

Can India expect 3rd wave what top who official says amid Omicron Fears.క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శ‌ర‌వేగంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Dec 2021 3:21 PM IST
భార‌త్‌లో థ‌ర్డ్‌వేవ్‌ అంచనాలపై డబ్ల్యూహెచ్ఓ రీజనల్ డైరెక్టర్ ఏం చెప్పారంటే..?

క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్ప‌టికే 59 దేశాల్లో ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తి చెందింది. ఇక భార‌త్‌లో కూడా ఇప్ప‌టి వ‌ర‌కు 36 కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో క‌రోనా థ‌ర్డ్ వేవ్ రాబోతుందా..? అనే అనుమానాలు మొద‌ల‌య్యాయి. వీటిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆగ్నేయాసియా రీజనల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ స్పందించారు. క‌రోనా మ‌హ‌మ్మారి ఇంకా అంతం కాలేద‌న్నారు. ఇప్ప‌టికి కూడా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో ప్ర‌మాద‌క‌ర స్థాయిలో కేసులు న‌మోదు అవుతున్నాయ‌న్నారు.

ఇక కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ కొద్దికాలంలోనే ప్రపంచమంతా వ్యాపించింద‌న్నారు. అలాగే అనేక ప‌రివ‌ర్త‌నాలు వెలుగుచూసిన నేప‌థ్యంలో ఈ కొత్త వేరియంట్ ప్ర‌భావం తీవ్రంగానే ఉండే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని తెలిపారు. అయితే.. ఏ స్థాయిలో అనేది ఇప్పుడే చెప్ప‌లేమ‌న్నారు. ఈ మ‌హ‌మ్మారికి ఎలాంటి లక్షణాలు కలిగిస్తుంది? ఇన్ఫెక్షన్ తీవ్రత, విస్తరణ వంటి అంశాలపై మరింత స్పష్టత రావాల్సి ఉందని.. అందుకే ప్రపంచ దేశాలు స‌మ‌గ్ర స‌మాచారం పంపాల‌ని కోరారు.

ద‌క్షిణాఫ్రికా అందించిన స‌మాచారం ప్ర‌కారం.. ఒమిక్రాన్ వ‌ల్ల రీఇన్ఫెక్ష‌న్లు అధికంగా న‌మోదు అవుతున్నాయ‌ని తెలిపారు. డెల్టా వేరియంట్ కంటే తక్కువ స్థాయిలోనే లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ.. ఇప్పుడిప్పుడే దీనిపై ఎలాంటి అంచనాలకు రాలేమని వెల్ల‌డించారు. ఇక ఒమిక్రాన్ కారణంగా భారత్ లో థర్డ్ వేవ్ రానుందా..? అనే అంశంపై కొంత అనిశ్చితి ఉందని పేర్కొన్నారు. భారత్ లో కొన్ని వారాల వ్యవధిలోనే ఒమిక్రాన్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది ఆమె వెల్ల‌డించారు.

Next Story