అత్యాచార బాధితురాలి గర్భాన్ని తొలగించిన డాక్టర్లు.. హైకోర్టు ఏం చేసిందంటే?

అత్యాచార బాధితురాలి గర్భాన్ని వైద్యుల బృందం తొలగించడంపై కలకత్తా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

By అంజి  Published on  4 Feb 2024 8:03 AM IST
Calcutta High Court, doctors, rape victim, pregnancy

అత్యాచార బాధితురాలి గర్భాన్ని తొలగించిన డాక్టర్లు.. హైకోర్టు ఏం చేసిందంటే?

అత్యాచార బాధితురాలి గర్భాన్ని వైద్యుల బృందం తొలగించడంపై కలకత్తా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బాధితురాలి సాధకబాధకాలను నిర్ధారించేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించినప్పటికీ ఎందుకు అలా చేశారంటూ కలకత్తా హైకోర్టు వారి నుంచి వివరణ కోరింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన నివేదికలో గర్భం ఇప్పటికే తొలగించబడిందని పేర్కొంది. సంబంధిత వైద్యుల పక్షాన ఇటువంటి చర్య ఓవర్ యాక్షన్ అని గమనించిన జస్టిస్ సబ్యసాచి భట్టాచార్య.. గర్భంను తొలగించడానికి కోర్టు అనుమతించలేదని, అయితే దాని సాధకబాధకాల గురించి నివేదికను మాత్రమే కోరిందని శుక్రవారం అన్నారు.

న్యాయస్థానం నుండి ఎటువంటి ఆదేశాలు లేకుండా "ఇంత హడావుడిగా" ఎందుకు గర్భం తొలగించారో వివరణ ఇవ్వాలని జస్టిస్ భట్టాచార్య ఆపరేషన్‌ ప్రక్రియను నిర్వహించిన సంబంధిత వైద్యులను ఆదేశించారు. ఫిబ్రవరి 9న తన ముందు సమర్పించే నివేదికలో అటువంటి అత్యవసరానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉంటే చెప్పాలని కోర్టు ఆదేశించింది. ఈ ఘటన కారణంగా గర్భం దాల్చాలనుకున్న అత్యాచార బాధితురాలి పరిస్థితిని పరిశీలించి ఫిబ్రవరిలో కోర్టుకు నివేదిక సమర్పించేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని జస్టిస్ భట్టాచార్య జనవరి 29న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించారు.

Next Story