తృటిలో తప్పిన పెను ప్రమాదం.. లేదంటే 14 మంది సజీవ సమాధే..!
Bus narrowly escapes fatal accident in Nainital after mountain landslide.ప్రకృతి కన్నెర జేస్తే ఎవరూ కూడా
By తోట వంశీ కుమార్ Published on 21 Aug 2021 8:20 AM GMTప్రకృతి కన్నెర జేస్తే ఎవరూ కూడా తప్పించుకోలేరన్నది వాస్తవం. ప్రకృతి సృష్టించే భీభత్సాలు అంతా ఇంతా కాదు. భూకంపాలు, సునామీ, కొండచరియలు విరిగిపడడం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు మనం చూశాం. అయితే.. అదృష్టం ఉండాలే కానీ పెను ప్రమాదం నుంచి బయటపడొచ్చు అన్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి సంఘటననే ఉత్తరఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఆ 14 మందికి ఇంకా భూమి మీద నూకలు తినే భాగ్యం ఉందనుకుంటా.. అందుకనే తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. లేదంటే.. సజీవ సమాధి అయ్యేవారే.
ఉత్తరఖాండ్‌లో ఇటీవల భారీ వర్షాలు కురిసాయి. దీంతో కొండ ప్రాంతాలు బాగా నానిపోయి ఉండి తరచూ రహదారులపై కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఈ కొండచరియలు విరిగిపడడంతో కొంత మంది ప్రాణాలు కోల్పోతుండగా.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. తాజాగా నైనిటాల్ పట్టణ పరిధిలో కూడా అలాంటి ఘటనే జరిగింది. ఓ బస్సు కొండ ప్రాంతం గుండా వెలుతుండగా.. ఒక్కసారిగా దాని ముందు కొండ చరియలు విరిగి పెద్ద మొత్తంలో మట్టి, రాళ్లు పడ్డాయి. ఆ సమయంలో బస్సులో 14 మంది ప్రయాణీకులు ఉన్నారు.
వెంటనే బస్సులోని ప్రయాణీకులు బస్సు దిగి వెనకకు పరుగులు తీశారు. డ్రైవర్ బస్సును రివర్స్ తీస్తున్నా కూడా.. భయంతో బస్సు దిగి పరుగు లంకించుకున్నారు. కాగా.. ఈ ఘటనలో ఎవ్వరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఒకవేళ ఆ బస్సు కొంచెం స్పీడుతో వచ్చినా.. లేక ఆ కొండచరియలు మరో పది సెకన్లు ఆలస్యంగా విరిగిపడ్డా.. సరిగ్గా బస్సు మీదనే పడుతుండేది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
#WATCH | Uttarakhand: A bus carrying 14 passengers narrowly escaped a landslide in Nainital on Friday. No casualties have been reported. pic.twitter.com/eyj1pBQmNw
— ANI (@ANI) August 21, 2021