ప్రయాణీకులతో వెలుతున్న బస్సు.. ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగరు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో 14 మంది గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భిండ్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్వాలియర్ నుండి మధ్యప్రదేశ్‌లోని బరేలీపై పట్టణానికి ప్రయాణీకులతో బస్సు వెలుతోంది. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో భీండ్ జిల్లాలోని వీర్‌ఖాది గ్రామం వద్ద బస్సు అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టింది.
ఈ ఘటనలో వారిలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 14 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను గ్వాలియర్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని పలువురు చెబుతున్నారు. మృతులను గుర్తించాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.