భారత్‌కు చేరుకున్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌

British PM Boris Johnson arrives in India.బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ భార‌త్‌కు చేరుకున్నారు. రెండు రోజుల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 April 2022 4:59 AM GMT
భారత్‌కు చేరుకున్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌

బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ భార‌త్‌కు చేరుకున్నారు. రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం లండ‌న్ నుంచి ప్ర‌త్యేక విమానంలో గుజరాత్‌లోని అహ్మ‌దాబాద్‌లో ల్యాండ్ అయ్యారు. అహ్మ‌దాబాద్ ఎయిర్ పోర్టులో ఆయ‌న‌కు గుజ‌రాత్ సీఎం భూపేంద్ర పటేల్‌, అధికారులు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. అక్క‌డ పారిశ్రామిక‌, వ్యాపార వేత్త‌ల‌తో స‌మావేశం కానున్నారు. భార‌త్‌-బ్రిట‌న్ వాణిజ్య, ప్ర‌జా సంబంధాల‌పై చ‌ర్చించ‌నున్నారు. పరిశ్రమల్లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, వైద్య, శాస్త్ర రంగాల్లో కలిసి పనిచేయడంపై ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది.

ఈ స‌మావేశం అనంత‌రం బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ ఢిల్లీ వెళ్ల‌నున్నారు. శుక్ర‌వారం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఇండో-పసిఫిక్ పరిస్థితిపై చ‌ర్చించే అవ‌కాశం ఉంది. కాగా.. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా గ‌తంలో రెండు సార్లు బోరిస్ జాన్స‌న్ భార‌త ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు. గత జనవరిలో గణతంత్ర వేడుకలకు భారత్‌ ఆహ్వానించగా.. యూకేలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఆయన పర్యటన వాయిదా పడింది. అనంతరం గతేడాది ఏప్రిల్‌లో పర్యటన ఖరారు కాగా.. భారత్‌లో కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో మరోసారి ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేశారు. కాగా.. ఎట్ట‌కేల‌కు బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ తొలి సారి ఇండియా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు.

Next Story