ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీస్ అధ్యక్షురాలు దాదీ హృదయ మోహిని కన్నుమూశారు. అనారోగ్యంతో ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 2020 మార్చి 27న రాజయోగిని దాదీ జానకి పరమపదించిన తర్వాత బ్రహ్మకుమారీస్ అధ్యక్షురాలిగా దాదీ హృదయ మోహిని బాధ్యతలు స్వీకరించారు. ఆమెను దాదీ గుల్జార్ అని కూడా పిలిచేవారు. దాదీ హృదయ మోహిని దిల్లీ జోనల్ అధిపతిగానూ పనిచేశారు. అన్ని ఖండాలలో ఆధ్యాత్మిక జ్ఞానం, రాజ్యోగ ధ్యానం, సాత్విక జీవనశైలిని వ్యాప్తి చేయడానికి దాదీ హృదయ మోహిని విశేష కృషి చేశారు. గతంలో ఢిల్లీ జోనల్ అధిపతిగా ఆమె పని చేశారు. హృదయ మోహిని ఇక లేరని తెలిసి యావత్ భారత్ కన్నీరు పెట్టుకుంటుంది. ప్రముఖులు ఆమెకు నీరాజనాలు పలికారు.