ప్రియురాలిని ట్రాలీ బ్యాగ్‌లో దాచాడు.. కాలేజీ హాస్టల్‌కు తీసుకెళ్తుండగా మధ్యలోనే..

Boy tries to sneak girlfriend inside Manipal hostel in trolley suitcase, caught red-handed. మణిపాల్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి తన ప్రియురాలిని ట్రాలీ బ్యాగ్‌లో దాచి లోపలికి వెళ్లేందుకు

By అంజి  Published on  4 Feb 2022 4:35 AM GMT
ప్రియురాలిని ట్రాలీ బ్యాగ్‌లో దాచాడు.. కాలేజీ హాస్టల్‌కు తీసుకెళ్తుండగా మధ్యలోనే..

మణిపాల్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి తన ప్రియురాలిని ట్రాలీ బ్యాగ్‌లో దాచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా హాస్టల్ కేర్‌టేకర్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. రిపోర్టు ప్రకారం.. ఓ విద్యార్థి తన ట్రాలీ బ్యాగ్‌తో హాస్టల్‌ లోపలికి వెళ్తేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ట్రాలీ బ్యాగ్ అక్కడే ఉన్న కేర్‌టేకర్ దృష్టిని ఆకర్షించిందని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. భారీ, బరువైన సామాను ఎందుకు తీసుకెళ్తున్నావని కేర్‌టేకర్ బాలుడిని ప్రశ్నించాడు. విద్యార్థి తటపటాయిస్తూ, అందులో తాను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వస్తువులు ఉన్నాయని చెప్పాడు.

అయితే కేర్‌టేకర్ మాత్రం ట్రాలీ బ్యాగ్‌పై అనుమానం వ్యక్తం చేశాడు. ట్రాలీ బ్యాగ్ లోపల చూడాలని డిమాండ్ చేశాడు. వస్తువులు నాజూకుగా ఉన్నాయని విద్యార్థి కేర్‌టేకర్‌ను ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ కేర్‌టేకర్‌ చలించలేదు. ట్రాలీ బ్యాగ్‌ని విప్పి చూడగా, బ్యాగ్‌లో బాలిక ముడుచుకుపోయి ఉన్నట్లు గుర్తించారు. ఆమె కళాశాల విద్యార్థిని, నృత్యకారిణి అని ప్రత్యక్ష సాక్షి విద్యార్థి తెలిపారు. అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ హాస్టల్ నుండి సస్పెండ్ చేయబడి ఇంటికి తిరిగి వచ్చారు.

ట్రాలీని తెరవమని భద్రతా సిబ్బంది అబ్బాయిని అడిగినప్పుడు ఒక అమ్మాయి ట్రాలీలోకి చొరబడి బయటకు వస్తున్న వీడియోను కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా తప్పుగా ఆపాదించిందని ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధి తెలిపారు. అయితే, ఒక అబ్బాయి తన స్నేహితురాలిని సూట్‌కేస్‌లో నింపిన సంఘటన బుధవారం మణిపాల్‌లోని ఓ ఇంజినీరంగ్‌ కాలేజీ వద్ద జరిగింది. ఈ చర్యకు పాల్పడినందుకు ఇన్స్టిట్యూట్ యొక్క అంతర్గత క్రమశిక్షణా కమిటీ వారిపై చర్య తీసుకుంది.

మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్న అబ్బాయి బ్లాక్ 5లో నివసిస్తుండగా, మణిపాల్ క్యాంపస్‌లోని కామర్స్ ఇనిస్టిట్యూట్‌లో చదువుతున్న అమ్మాయి బ్లాక్ 13లోని హాస్టల్‌లో నివసిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. భద్రతా సిబ్బంది బాలుడిని పరీక్షించి, అనుమానాస్పదంగా కనిపించడంతో సూట్‌కేస్ తెరవమని కోరగా, అతను విముఖత వ్యక్తం చేశాడు. చివరకు అతను దానిని తెరిచినప్పుడు, అతని స్నేహితురాలు బయటకు వచ్చింది. అదృష్టవశాత్తూ, బాలిక స్పృహలో ఉంది. ఎటువంటి వైద్య సహాయం అవసరం లేదని తెలిసింది.

ఒమిక్రాన్ ఉధృతి నేపథ్యంలో మధ్య బయటి వ్యక్తులను హాస్టల్‌లోకి అనుమతించడం లేదని వర్గాలు తెలిపాయి. అయితే ఆ అబ్బాయి తన ప్రియురాలితో కొంత సమయం గడపాలని భావించి, తన సూట్‌కేస్‌లో ఆమెను తన హాస్టల్ గదికి తీసుకెళ్లేందుకు పథకం రచించాడు. అయితే తమపై ఆపాదించబడిన ధృవీకరించని వీడియోను ప్రచురించినందుకు మీడియా సంస్థలపై చర్య తీసుకోబడుతుందని మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మూలాలు తెలిపాయి.

Next Story