దారుణం : ఒకే అంబులెన్సులో 22 కరోనా మృతదేహాలు కుక్కారు..!

22 corona dead bodies in a single ambulance, taken for cremation.. ఒకే అంబులెన్సులో ఏకంగా 22 కరోనా మృతదేహాలను కుక్కి పంపుతున్న ఘ‌ట‌న బ‌య‌టికి వ‌చ్చింది.

By Medi Samrat
Published on : 27 April 2021 1:35 PM IST

corona dead bodies in ambulance

మహారాష్ట్రలోని బీద్ జిల్లాలో దారుణం వెలుగులోకి వ‌చ్చింది. ఒకే అంబులెన్సులో ఏకంగా 22 కరోనా మృతదేహాలను కుక్కి పంపుతున్న ఘ‌ట‌న బ‌య‌టికి వ‌చ్చింది. ఇంత‌టి దురాగ‌తాన్ని ప్ర‌శ్నిస్తే నిర్లక్ష్యపు సమాధానమిస్తున్నారు అధికారులు. వివ‌రాళ్లోకెళితే.. మహారాష్ట్రలోని బీద్ జిల్లాలోని అంబజోగైలోని స్వామి రామానందతీర్థ మరాఠ్వాడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుంచి ఒకేసారి 22 కరోనా మృతదేహాలను త‌ర‌లిస్తున్న ఘ‌ట‌న బ‌య‌టికి వ‌చ్చింది.

ఘ‌ట‌న‌పై ఆసుపత్రి డీన్ డాక్టర్ శివాజీ శుక్ర మాట్లాడుతూ.. మా దగ్గర కేవలం రెండే అంబులెన్సులున్నాయి. మరిన్ని కావాలని అడిగినా ఎవరూ స్పందించలేదు. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలకు అంతిమసంస్కారాలను నిర్వహించేందుకు మృతదేహాలను పురపాలక శాఖ అధికారులకు అప్పగించడం మా బాధ్యత. వారు చేసిన దానికి మేమెలా బాధ్యులమవుతామని అన్నారు.

అయితే.. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఫొటోలు తీసిన వారి బంధువుల సెల్ ఫోన్ల‌ను పోలీసులు లాక్కున్నారు. అంత్యక్రియలు పూర్తయ్యాక తిరిగిచ్చారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌పై పెను దుమార‌మే రేగుతుంది. ఘటనపై పూర్తి దర్యాప్తు చేయాల్సిందిగా బీద్ జిల్లా కలెక్టర్ రవీంద్ర జగ్తప్ అదనపు కలెక్టర్ ను ఆదేశించారు. అలాగే.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.




Next Story