దొరికిన బ్లాక్‌బాక్స్‌.. రేపు ఢిల్లీలో రావత్ అంత్యక్రియలు

Black Box of Ill-fated Mi-17VH Helicopter Recovered.సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ స‌హా 14 మంది ప్ర‌యాణిస్తున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Dec 2021 11:11 AM IST
దొరికిన బ్లాక్‌బాక్స్‌.. రేపు ఢిల్లీలో రావత్ అంత్యక్రియలు

సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ స‌హా 14 మంది ప్ర‌యాణిస్తున్న భార‌త వాయుసేన‌కు సంబంధించిన ఎంఐ17వీ5 (Mi-17V5) హెలికాప్టర్ త‌మిళ‌నాడు రాష్ట్రంలోని నీల‌గిరి జిల్లా కూనూర్ వద్ద కూలిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ స‌హా 13 మంది దుర్మ‌ర‌ణం చెందారు. కాగా.. ఈ ప్ర‌మాదం ఎలా జ‌రిగింది అనేది ఇంకా తెలియ‌రాలేదు. కీల‌కంగా బావిస్తున్న బ్లాక్‌బాక్స్‌ను త‌మిళ‌నాడు ఫోరెన్సిక్ సైన్స్ విభాగానికి చెందిన బృందం గురువారం గుర్తించింది. ప్ర‌మాద స్థ‌లం నుంచి 30 అడుగుల దూరంలో బ్లాక్‌బాక్స్‌ను గుర్తించి స్వాధీనం చేసుకొని, వెల్లింగ్టన్‌ బేస్‌ క్యాంప్‌కు త‌ర‌లించారు. ప్ర‌మాద ద‌ర్యాప్తులో ఈ బ్లాక్‌బాక్స్ కీల‌కం కానుంది. అందులో న‌మోదైన సంబాష‌ల ఆధారంగా ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలుసుకునే వీలుంది. దీంతో దీన్ని ఢీ కోడ్ చేసేందుకు ఢిల్లీకి త‌ర‌లించ‌నున్నారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన వైమానిక ద‌ళాధిప‌తి

గురువారం ఘ‌ట‌నా స్థలాన్ని ఐఏఎఫ్‌ చీఫ్‌ వీఆర్‌ చౌదరి పరిశీలించారు. తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబుతో కలిసి ప్ర‌మాద‌స్థ‌లికి ఆయ‌న వెళ్లారు. ఆర్మీకి చెందిన అధికారులు ఆయనకు వివరాలు తెలిపారు.

రేపు అంత్య‌క్రియ‌లు..

హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మృతిచెందిన త్రివిధ ద‌ళాధిప‌తి బిపిన్ రావ‌త్‌కు రేపు సైనిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు. గురువారం సాయంత్రం బిపిన్ రావ‌త్ దంపతుల పార్థివ దేహాల‌ను.. కోయంబ‌త్తూరు నుంచి వాయుసేన ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీకి త‌ర‌లించ‌నున్నారు. ఆయన నివాసంలో భౌతిక‌కాయాన్ని ఉంచ‌నున్నారు. రేపు(శుక్ర‌వారం) ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం బ్రార్ స్క్వైర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Next Story