ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఆరో దశ పోలింగ్‌లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం గోరఖ్‌పూర్‌లో ఓటు వేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో 80 శాతానికి పైగా సీట్లను గెలుచుకుంటుందని అన్నారు. గోరఖ్‌పూర్ అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి ఆదిత్యనాథ్ పోటీ చేస్తున్నారు. ఓటు వేసిన అనంతరం అభివృద్ధి, భద్రత అంశాలపై ఓటు వేయాలని ఓటర్లకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు పెద్దఎత్తున ఓటు వేస్తారని ఆశిస్తున్నాను. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ రాష్ట్రంలోని అత్యధిక స్థానాలు గెలుచుకుని రికార్డు సృష్టించి.. 80 శాతానికి పైగా విజయం సాధిస్తుందన్నారు."
"అభివృద్ధి, భద్రత కోసం ఓటు వేయండి, బిజెపికి ఓటు వేయండి" యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అంతకుముందు ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నిర్ణయాత్మక దశకు చేరుకున్నాయి. అధికార భారతీయ జనతా పార్టీకి ప్రతి ఓటు భారతదేశం యొక్క నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా మారడానికి యూపీ సహాయపడుతుంది. ఉత్తరప్రదేశ్ మంత్రి ఉపేంద్ర తివారీ..ఫెఫ్నా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తూ, బల్లియాలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. 'బీజేపీ గెలుస్తుందన్న నమ్మకం నాకు ఉంది' అని ఆయన చెప్పారు.