వాయనాడ్ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ.. ప్రియాంక గాంధీని ఢీ కొట్టేది ఎవ‌రంటే..

కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి నవ్య హరిదాస్‌ను బీజేపీ పోటీకి దింపింది.

By Medi Samrat  Published on  19 Oct 2024 8:39 PM IST
వాయనాడ్ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ.. ప్రియాంక గాంధీని ఢీ కొట్టేది ఎవ‌రంటే..

కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి నవ్య హరిదాస్‌ను బీజేపీ పోటీకి దింపింది. ప్రియాంక గాంధీపై పోటీ చేస్తున్న నవ్య హరిదాస్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. కేరళ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా కూడా ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నవ్య కోజికోడ్‌లోని కరప్రాంప్‌లో కౌన్సిలర్‌గా ఉన్నారు. 2021లో కోజికోడ్ సౌత్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. అయితే ఆమె ఎన్నికల్లో ఓడిపోయింది.

ఇదిలావుంటే.. దేశ వ్యాప్తంగా ప‌లు స్థానాల‌లో జ‌రుగ‌నున్న ఉప ఎన్నికల‌ కోసం బీజేపీ 25 మంది అభ్యర్థులను ప్రకటించింది. 24 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానాల‌కు అభ్యర్థులను ప్రకటించింది. అస్సాంలో 3, ఛత్తీస్‌గఢ్‌లో 1, కర్ణాటక, కేరళ, బీహార్, మధ్యప్రదేశ్‌లో 2, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌లలో 6 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.

Next Story