కరోనాతో బాధపడుతున్న వారిని పరామర్శించేందుకు, వారిలో ధైర్యం నింపేందుకు వెళ్లి వస్తున్న బీజేపీ లోక్ సభ సభ్యురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడు చేశారు. రోడ్డుకి అడ్డంగా వచ్చి ఒక్కసారిగా ఆమె కారును ఆపిన కొందరు దుండగులు రాళ్లు, ఇనుప రాడ్లతో దాడులకు పాల్పడ్డారు. దీంతో ఆమె వాహనం అద్దాలు పగిలి, తీవ్రవంగా దెబ్బతిన్నది. ఈ ఘటన నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు. రాజస్థాన్ లోని ధర్సోని గ్రామం మీదుగా భరత్ పూర్లో వెళుతుండగా రాత్రి 12 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఒక్కసారిగా ఐదారుగురు వ్యక్తులు రాళ్లు, ఇనుప రాడ్లతో దాడికి తెగబడ్డారనీ ఎంపీ రంజిత, ఆమె అనుచరులు చెబుతున్నారు. ఈ సంఘటన సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. స్వల్ప గాయాలపాలైన వారంతా కి ప్రథమ చికిత్స తరువాత డిశ్చార్జయ్యారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎంపీ రంజిత టీమ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దాడి కారణంగా ఎంపీ మూరపోయారని, ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోవడానికి 45 నిమిషాలు పట్టిందని చెప్పారు. అయితే అర్థరాత్రి కావడంతో నిందితులను గుర్తించలేకపోయారు. ఈ సంఘటనపై రాజస్థాన్ పోలీసులు కూడా ట్విట్టర్లో స్పందించారు. పలు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇకపై ఎంపీ రంజిత కు అదనపు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తున్నట్టుగా తెలిపారు.
జ్యోత్స్న

నేను జ్యోత్స్న, న్యూస్‌మీట‌ర్‌లో కంట్రిబ్యూట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాను. గ‌తంలో tv9, జెమినీ న్యూస్ ల‌లో జ‌ర్న‌లిస్టుగా విధులు నిర్వ‌ర్తించాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో, నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Next Story