ఎంపీ కోడలు ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే..

BJP MP Kaushal Kishore's daughter-in-law attempts suicide. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ కోడ‌లు ఆత్మహత్యాయత్నానికి పాల్ప‌డింది.

By Medi Samrat
Published on : 15 March 2021 4:54 AM

BJP MP Kaushal Kishore’s daughter-in-law attempts suicide.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ కోడ‌లు ఆత్మహత్యాయత్నానికి పాల్ప‌డింది. చేతి నరాలను కోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. వివ‌రాళ్లోకెళితే.. మోహ‌న్ లాల్ గంజ్‌ ఎంపీ కౌశల్ కిశోర్ కోడలు అంకిత ఆత్మహత్యాయత్నానికి పాల్ప‌డింది. ప్రస్తుతం ఆమె ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అయితే.. ఆత్మహత్యా ప్రయత్నానికి ముందు అంకితకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో ఆమె తన భర్త, అత్త‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఒక వీడియో ఐదు నిముషాలు ఉండగా, మరో వీడియో మూడు నిముషాలు ఉంది. ఆ వీడియోల్లో ఆమె తన పుట్టింట్లో ఉంటూ భర్త కోసం ఎదురు చూస్తున్నానని.. త‌న భ‌ర్త‌ రాడని భావించి ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నానని.. అందుకే ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు తెలిపారు.

దీనిపై సమాచారం అందుకున్న వెంటనే అలీగంజ్ ఎస్పీ అఖిలేష్ సింగ్ మూడు బృందాలను ఏర్పాటు చేసి, ఆమె కోసం గాలించారు. అర్థరాత్రి దాటాక ఆమె ఆచూకీ తెలుసుకుని, మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ వీడియోను చూసిన ఎస్పీ ఆమెను మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.





Next Story