Video : రీల్‌ చేస్తూ నదిలో పడిపోయిన‌ బీజేపీ ఎమ్మెల్యే..!

దేశ రాజధాని ఢిల్లీకి చెందిన‌ బీజేపీ ఎమ్మెల్యేకు సంబంధించిన‌ వీడియో ఒక‌టి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By -  Medi Samrat
Published on : 28 Oct 2025 3:11 PM IST

Video : రీల్‌ చేస్తూ నదిలో పడిపోయిన‌ బీజేపీ ఎమ్మెల్యే..!

దేశ రాజధాని ఢిల్లీకి చెందిన‌ బీజేపీ ఎమ్మెల్యేకు సంబంధించిన‌ వీడియో ఒక‌టి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీజేపీ ఎమ్మెల్యే రవి నేగి యమునా నది ఒడ్డున రీల్‌ చేస్తుండగా కాలు జారి నేరుగా నదిలో పడిన దృశ్యం వైరల్‌గా మారింది. ఆయ‌న‌తో ఉన్న వ్యక్తి ఆయ‌న‌ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆయ‌న సెకన్ల వ్య‌వ‌ధిలో నదిలో పడిపోయారు.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సంజీవ్ ఝా బీజేపీపై విరుచుకుపడ్డారు. అబద్ధాల ఎత్తులు దాటిన బీజేపీ ఎమ్మెల్యే రవి నేగి తన ఎక్స్ ఖాతాలో రాసుకున్నాడు. వాక్చాతుర్యం ఇప్పుడు తన వృత్తిగా మారిందని రాశారు. బహుశా ఈ అబద్ధాల రాజకీయాలతో విసిగిపోయి, యమునా మైయా స్వయంగా అతడిని తన వద్దకు పిలిచిందని దుయ్య‌బ‌ట్టారు. బీజేపీ ఎమ్మెల్యే రవీంద్ర నేగికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలా మంది ఈ వీడియోను తమ వ్యక్తిగత X, Facebook, Instagram ఖాతాలలో షేర్ చేశారు.

యమునా నది పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రీల్ చిత్రీకరిస్తుండగా.. ఆయన కాలు జారి నదిలో పడిపోయారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఛత్ పూజ వేడుకల సందర్భంగా యమునా నది శుభ్రత విషయంలో ఢిల్లీలోని అధికార బీజేపీ, ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తీవ్రమైన మాటల యుద్ధం జరుగుతున్న స‌మ‌యంలో ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డం విశేషం.

Next Story