ఆసుపత్రి మీదకు కారుతో దూసుకుని వెళ్లిన బీజేపీ నేత

BJP Leader Rams Car Into COVID-19 Hospital In Nashik. ఓ బీజేపీ నేత తన తండ్రి చనిపోయిన ఆసుపత్రిపై ఆగ్రహాన్ని చూపించాడు.

By Medi Samrat  Published on  16 May 2021 11:39 AM GMT
ఆసుపత్రి మీదకు కారుతో దూసుకుని వెళ్లిన బీజేపీ నేత

కరోనా కారణంగా ఎంతో మంది ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. కోటీశ్వరులైనా, కటిక పెద్దలైనా కరోనా మహమ్మారి దెబ్బకు ప్రాణాలను వదులుతూ ఉన్నారు. తమ కళ్ల ముందు ఇన్ని రోజులూ ఉన్న వాళ్లే ఇప్పుడు కనిపించకుండా పోయారనే బాధ ప్రతి ఒక్కరినీ వెంటాడుతూ ఉంది. ఆసుపత్రులు, వైద్యులు కూడా తమ వంతు ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నారు. ప్రాణాలను కాపాడలేకపోతున్నామనే బాధ వాళ్ళను కూడా వెంటాడుతూ ఉంది. ఇలాంటి తరుణంలో ఓ బీజేపీ నేత తన తండ్రి చనిపోయిన ఆసుపత్రిపై ఆగ్రహాన్ని చూపించాడు.

మహారాష్ట్ర లోని నాసిక్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం నాడు బీజేపీ నేత కోవిడ్-19 ఆసుపత్రిలోని కారుతో దూసుకుని వచ్చాడు. ఎంట్రెన్స్ లో ఉన్న అద్దాలను పగులగొట్టాడు. ఈ షాకింగ్ చర్యలకు పాల్పడింది బీజేపీ నేత రాజేంద్ర తాంజే. బైక్టో ఆసుపత్రి ముందు ఉన్న అద్దాన్ని ఆయన తన ఇన్నోవా వాహనంతో ఢీకొట్టారు. ఈ ఘటనతో ఆసుపత్రి సిబ్బంది షాక్ కు గురయ్యారు. ఆసుపత్రి సిబ్బందిని ఆయన ఇష్టం వచ్చినట్లు తిట్టడం కూడా మనం చూడొచ్చు.

ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో రాజేంద్ర తాంజే తాగి ఉన్నట్లు గుర్తించారు. రాజేంద్ర తాంజే తండ్రికి కరోనా సోకడంతో ఈ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అయితే 10 రోజుల కిందట రాజేంద్ర తాంజే తండ్రి కన్నుమూశారు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న రాజేంద్ర తాంజే తన ఇన్నోవా వాహనంతో ఆసుపత్రి ముందున్న అద్దాన్ని బద్దలు కొట్టాడు. రాజేంద్ర తాంజే భార్య సీమా తాంజే నాసిక్ లో కౌన్సిలర్ గా ఉన్నారు. అతడు చేసిన పని పోలీసుల దాకా వెళ్లడంతో అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.


Next Story