ముస్లిం వ్యక్తితో కుమార్తె వివాహాన్ని రద్దు చేసుకున్న బీజేపీ నేత
భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు యశ్‌పాల్ బెనమ్ శనివారం ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్‌లో ముస్లిం వ్యక్తితో తన కుమార్తె వివాహాన్ని
By అంజి Published on 21 May 2023 1:00 PM ISTముస్లిం వ్యక్తితో కుమార్తె వివాహాన్ని రద్దు చేసుకున్న బీజేపీ నేత
భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు యశ్‌పాల్ బెనమ్ శనివారం ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్‌లో ముస్లిం వ్యక్తితో తన కుమార్తె వివాహాన్ని వరుడి కుటుంబంతో “పరస్పర అంగీకారంతో” రద్దు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ పెళ్లి ఆహ్వానపత్రిక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది "వివాదానికి" దారితీసింది. దీంతో పెళ్లి రద్దయ్యింది. బీజేపీ నేత కుమార్తె వివాహం మే 28న జరగాల్సి ఉంది. ఇప్పుడు మే 28న జరగాల్సిన పెళ్లి క్యాన్సిల్ అయింది’’ అని బీజేపీ నేత శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
''ప్రజా ప్రతినిధి అయినందున, నా కుమార్తె వివాహం పోలీసు, ప్రభుత్వ రక్షణలో జరగాలని నేను కోరుకోలేదు. ప్రజల మనోభావాలను గౌరవిస్తాను'' అని ఆయన అన్నారు. ఇరు కుటుంబాల అంగీకారం మేరకే పెళ్లికి అంగీకారం కుదిరిందని, అయితే కొన్ని విషయాలు తెరపైకి రావడంతో విరమించుకోవాల్సి వచ్చిందని బెనామ్ తెలిపారు.
''నా కూతురు ముస్లిం యువకుడితో పెళ్లి చేసుకోబోతుంది. పిల్లల సంతోషం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, రెండు కుటుంబాలు వారికి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాయి, దాని కోసం కార్డులు కూడా ముద్రించబడ్డాయి. పంచుకున్నారు. అయితే పెళ్లికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెళ్లిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలు రకాల విషయాలు తెరపైకి వచ్చాయి'' అని యశ్‌పాల్ బెనమ్ తెలిపారు.
"వివాదాలు చెలరేగిన తరువాత, పరస్పర అంగీకారంతో, ప్రస్తుతానికి వివాహ ఆచారాలను నిర్వహించకూడదని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి" అని బిజెపి నాయకుడు తెలిపారు. అయితే అదే వ్యక్తితో తన కుమార్తె పెళ్లి విషయంలో కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు, వరుడి తరఫు వారు కలిసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.