సీసీటీవీ ఫుటేజీలో బిష్ణోయ్ గ్యాంగ్‌ ప్రత్యర్థుల అరాచకాలు

బిష్ణోయ్ గ్యాంగ్‌ పేరు దేశ వ్యాప్తంగా వినిపిస్తూ ఉంది. పలువురు ప్రముఖులు బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ గా ఉన్నారని తెలియడంతో వారిలో టెన్షన్ మొదలైంది.

By Kalasani Durgapraveen  Published on  3 Nov 2024 12:46 PM GMT
సీసీటీవీ ఫుటేజీలో బిష్ణోయ్ గ్యాంగ్‌ ప్రత్యర్థుల అరాచకాలు

బిష్ణోయ్ గ్యాంగ్‌ పేరు దేశ వ్యాప్తంగా వినిపిస్తూ ఉంది. పలువురు ప్రముఖులు బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ గా ఉన్నారని తెలియడంతో వారిలో టెన్షన్ మొదలైంది. ఇప్పుడు బిష్ణోయ్ గ్యాంగ్ ప్రత్యర్థులు కూడా అరాచకాలను సృష్టిస్తూ ఉన్నారు. అక్టోబరు 26న ఢిల్లీలోని రాణిబాగ్‌లో బిష్ణోయ్ గ్యాంగ్ ప్రత్యర్థులు జరిపిన కాల్పులు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనలో బిష్ణోయ్ గ్యాంగ్‌ ను వ్యతిరేకించే గ్రూప్ తో సంబంధం ఉన్న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యాపారవేత్త ఇంటిపై కాల్పులు జరిపారు. 15 కోట్ల రూపాయలను నిందితులు డిమాండ్ చేశారు, ఆ తర్వాత ఈ ఘటన జరిగింది.

ఇద్దరు వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై వ్యాపారవేత్త నివాసం వద్దకు వస్తున్నట్లు వీడియోలో చూడొచ్చు. వారిలో ఒకరు ఫోన్ నంబర్‌తో ఉన్న నోట్‌ను లోపలికి విసిరేయడం కనిపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత, షూటర్ తన మొబైల్ టార్చ్‌ని ఉపయోగించి దృశ్యాన్ని రికార్డ్ చేస్తూ అనేక రౌండ్లు కాల్చాడు.

బిష్ణోయ్ గ్యాంగ్ ప్రత్యర్థులైన 'బాంబిహా గ్యాంగ్' తమ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలోని వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. విదేశాల్లో ఉన్న ముఠా నాయకులు తరచూ స్థానిక షూటర్లను రిక్రూట్ చేసుకుని దాడులు చేసి, వాటిని రికార్డ్ చేసి, వీడియోలను సోషల్ మీడియాలో బెదిరింపులు దిగడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ రెండు రోజుల తర్వాత ఇద్దరు షూటర్లను అరెస్టు చేసింది. షూటర్లిద్దరూ ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు.

Next Story