పెను విషాదం.. తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మృతి
బాబా సిద్ధాంత్ ఆలయంలో సోమవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 12 Aug 2024 7:16 AM ISTపెను విషాదం.. తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మృతి
బీహార్‌లో విషాదం చోటుచేసుకుంది. జెహనాబాద్ జిల్లాలోని బాబా సిద్ధాంత్ ఆలయంలో సోమవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మఖ్దుంపూర్, జెహనాబాద్‌లోని ఆసుపత్రులకు తరలించారు పోలీసులు.
జెహనాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ అలంకృత పాండే ఈ మేరకు తొక్కిసలాట సంఘటనపై మాట్లాడారు. "జెహనాబాద్ జిల్లా మఖ్దుంపూర్‌లోని బాబా సిద్ధనాథ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మరణించారు. తొమ్మిది మంది గాయపడ్డారు. మేము ఈ సంఘటనపై పర్యవేక్షిస్తున్నాము. ఇప్పుడు ఆలయంలో పరిస్థితి అదుపులో ఉంది." అని అలంకృత పాండే వెల్లడించారు. అయితే.. తొక్కిసలాట జరిగిన సంఘటన గురించి వార్త అందగానే ఆయన అక్కడికి చేరుకున్నారు. ఆయనతో పాటు పోలీస్ సూపరింటెండెంట్ కూడా ఘటనాస్థలానికి వెళ్లారు.
#WATCH | Bihar: Vikas Kumar, SDO Jehanabad says, "It is a sad incident...All the arrangements were tight, we are taking stock of the situation and then will further inform you about this..." https://t.co/yw6e4wzRiY pic.twitter.com/N7l6yyQrQE
— ANI (@ANI) August 12, 2024
అయితే.. చనిపోయిన వ్యక్తుల వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. వారి ఐడెంటీని కొనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. "డీఎం, ఎస్పీ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. వారు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అలాగే.. చనిపోయిన వారి మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం పంపనున్నట్లు అధికారులు వెల్లడించారు.