కాలు ఎముక విరిగిందని ఆస్పత్రికి వెళ్తే.. కార్డ్‌బోర్డ్‌ అట్ట కట్టి పంపించేశారు

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ప్రమాదవశాత్తు కాలికి గాయమైన ఓ వ్యక్తి చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు.

By అంజి  Published on  14 Jun 2024 2:08 AM GMT
Bihar, hospital, fractured bone, cardboard

కాలు ఎముక విరిగిందని ఆస్పత్రికి వెళ్తే.. కార్డ్‌బోర్డ్‌ అట్ట కట్టి పంపించేశారు

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ప్రమాదవశాత్తు కాలికి గాయమైన ఓ వ్యక్తి చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. అయితే, విరిగిన కాలును సరిచేయడానికి వైద్యులు కార్డ్‌బోర్డ్ ఉపయోగించడంతో అతను ఆశ్చర్యపోయాడు. అతడిని మరో ఆసుపత్రికి రెఫర్ చేయగా అక్కడి వైద్యులు కూడా అతడి కాలును సరిచేయడానికి ఉంచిన అట్టను తీయలేదు.

ముజఫర్‌పూర్‌లోని మినాపూర్ ప్రాంతంలో ఉన్న ముఖేష్ కుమార్ అనే రోగిని జూన్ 7న బైక్‌పై వెళుతుండగా ప్రమాదానికి గురై కాలు విరగడం, ఇతర గాయాలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (PHC) చేర్పించారు. అతని విరిగిన ఎముకకు చికిత్స చేయడానికి వైద్యులు కార్డ్‌బోర్డ్ ఉపయోగించారు. తరువాత, తదుపరి చికిత్స కోసం శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీ (SKMCH) కు రిఫర్ చేశారు. అయితే, వైద్యులు జూన్ 7 నుండి 11 వరకు ప్లాస్టర్ కాస్ట్‌కు బదులుగా కార్డ్‌బోర్డ్ అచ్చుతో అతనికి చికిత్స కొనసాగించారు.

స్థానిక మీడియా చికిత్సలో నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపడంతో శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీ అధికారులు చర్యలు తీసుకున్నారు. సరైన చికిత్స ప్రారంభించారు. ముఖేష్‌ కుమార్ మాట్లాడుతూ, "గత శనివారం, నేను బైక్ నడుపుతూ ప్రమాదానికి గురయ్యాను. ప్రమాదం జరిగిన తర్వాత, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ఒక కార్డ్‌బోర్డ్ అచ్చుతో నన్ను శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీకి రెఫర్ చేశారు, అది ఇప్పటికీ అలాగే ఉంది" అని చెప్పారు.

ఈ ఘటనపై ఎస్‌కెఎంసిహెచ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విభ మాట్లాడుతూ.. ''శనివారం మినపూర్‌ నుంచి ఎస్‌కెఎంసిహెచ్‌కి అట్టతో పేషెంట్‌ వచ్చాడు. ప్లాస్టర్‌ వేయలేదని మాకు సమాచారం అందిందని, విచారణలో ఆర్థోపెడిక్‌ విభాగం వైద్యులు తెలిపారు. పిహెచ్‌సిలో కార్డ్‌బోర్డ్ ఎలా ఉపయోగించబడిందో తెలుసుకోవడానికి నేను విచారణకు ఆదేశించాను'' అని తెలిపారు.

Next Story