దోసెలో సాంబార్ ఇవ్వలేదని.. రెస్టారెంట్‌కు కోర్టు జరిమానా.. ఎంతంటే?

దోసెలో సాంబార్‌ ఇవ్వలేదని రెస్టారెంట్‌కు ఓ లాయర్‌ చుక్కలు చూపించాడు. వినియోగదారుల కోర్టులో కేసు వేసి రెస్టారెంట్‌కు భారీ జరిమానా పడేలా చేశాడు.

By అంజి  Published on  14 July 2023 5:14 AM GMT
Dosa, Sambar, Bihar, Food

దోసెలో సాంబార్ ఇవ్వలేదని.. రెస్టారెంట్‌కు కోర్టు జరిమానా.. ఎంతంటే? 

దోసెలో సాంబార్‌ ఇవ్వలేదని రెస్టారెంట్‌కు ఓ లాయర్‌ చుక్కలు చూపించాడు. వినియోగదారుల కోర్టులో కేసు వేసి రెస్టారెంట్‌కు భారీ జరిమానా పడేలా చేశారు. దోసె ఆర్డర్‌లో సాంబార్‌ను చేర్చనందుకు స్థానిక రెస్టారెంట్‌పై న్యాయ పోరాటంలో విజయం సాధించారు. ఈ ఘటన బీహార్‌ రాష్ట్రంలో జరిగింది. మనీష్ పాఠక్ అనే న్యాయవాది రూ.140 పెట్టి.. ఓ స్పెషల్‌ మసాలా దోసె పార్మిల్‌ ఆర్డర్‌ ఇచ్చాడు. ఆ తర్వాత ఇంటి కొచ్చి పార్మిల్‌ ఓపెన్‌ చేసి చూశాడు. అందులో దోసె, చట్నీ తప్ప సాంబార్‌ కనబడలేదు. దీంతో ఆ లాయర్‌కు రెస్టారెంట్‌పై చిర్రెత్తుకొచ్చింది.

వినియోగదారుగా తన హక్కుల కోసం నిలబడాలని ఎంచుకున్నాడు. వెంటనే వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. 11 నెలల పాటు న్యాయపోరాటం చేశాడు. అంటే దాదాపు ఒక సంవత్సరం పాటు, అతను తన కేసును వాదించాడు. కోర్టు చివరకు రెస్టారెంట్ నిర్వాహకులదే తప్పని తేల్చింది. ఆ రెస్టారెంట్‌పై ఏకంగా రూ.3500 జరిమానా విధించింది. 45 రోజుల్లోగా ఈ జరిమానా చెల్లించాలని గడువు విధించిన కమిషన్, జాప్యం జరిగితే 8 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని కూడా పేర్కొంది.

Next Story