కోడిగుడ్లు అమ్మే వ్యక్తి కొడుకు న్యాయమూర్తి అయ్యాడు.. ఆర్థిక కష్టాలను అధిగమించి..

బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) 32వ జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, కొడుగుడ్లు అమ్ముకునే వ్యక్తి కుమారుడు ఆదర్శ్ కుమార్ సివిల్ జడ్జి అయ్యాడు.

By అంజి  Published on  1 Dec 2024 8:36 AM IST
Bihar, egg seller son, judge, financial struggles, BPSC

కోడి గుడ్లు అమ్మే వ్యక్తి కొడుకు న్యాయమూర్తి అయ్యాడు.. ఆర్థిక కష్టాలను అధిగమించి..

బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) 32వ జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, కొడుగుడ్లు అమ్ముకునే వ్యక్తి కుమారుడు ఆదర్శ్ కుమార్ సివిల్ జడ్జి అయ్యాడు. ఆదర్శ్ కుమార్‌ ఔరంగాబాద్‌లోని శివగంజ్‌కు చెందినవాడు. అతని తండ్రి విజయ్ సా తన కుటుంబ పోషణ కోసం శివగంజ్ మార్కెట్‌లో బండిపై గుడ్లు అమ్మేవాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, విజయ్ తన పిల్లల చదువుపై ఎలాంటి ప్రభావం పడకుండా చూసుకున్నాడు. అతని భార్య సునయన కూడా ఆర్థిక ఇబ్బందులను దాచిపెట్టి పిల్లల చదువుల కోసం స్వయం సహాయక సంఘంలో అప్పులు తీసుకుంది.

తల్లిదండ్రులు తన కోసం అహర్నిశలు శ్రమించడాన్ని ఆదర్శ్‌ చూశాడు. చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. పాట్నాలోని చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ నుండి ఐదు సంవత్సరాల BA LLB డిగ్రీని పూర్తి చేసిన తర్వాత, ఆదర్శ్ BPSC జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాడు. తన విజయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేసాడు, "నేను మా అమ్మ, నాన్నలకు రుణపడి ఉంటాను. వారి కృషి నన్ను అదే అంకితభావంతో పనిచేయడానికి ప్రేరేపించింది." ఆదర్శ్ కుమార్ తల్లి తన కొడుకుపై చాలా ఆశలు పెట్టుకుందని, ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ అతను ఎలా చదివాడనే దాని గురించి తాను చాలా గర్వపడుతున్నానని చెప్పారు.

Next Story