పాముతో ఆడి బొమ్మ అనుకుని కొరికిన బాలుడు

బీహార్‌లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది

By Srikanth Gundamalla  Published on  21 Aug 2024 7:45 AM IST
bihar, child, play,  snake,

 పాముతో ఆడి బొమ్మ అనుకుని కొరికిన బాలుడు 

బీహార్‌లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఓ బాలుడు ఇంటి ఆవరణలోనే ఆడుకుంటూ ఉన్నాడు. అయితే.. తల్లి ఏదో పనిలో పడిపోయింది. బాలుడు అలా ఆడుకుంటున్న సమయంలోనే అక్కడికి పాము వచ్చింది. దాన్ని బొమ్మగా భావించిన బాలుడు.. పాముని పట్టుకుని ఆడుకున్నాడు. ఆ తర్వాత నోట్లో పెట్టుకుని కొరికి నమిలాడు. మూడు అడుగుల పామును బాలుడు కొరికిన సంఘటన ఫుతేపుర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జముహర్ గ్రామంలో చోటుచేసుకుంది.

కాసేపటికే తల్లి బాలుడు దగ్గరకు వచ్చించింది. బాబు దగ్గర పాము ఉండటం.. దానిని కొరుకుతుండటం చూసి భయాందోళనకు గురైంది. వెంటనే ఆ పామును అక్కడి నుంచి దూరంగా విసిరేసింది. కుమారుడికి ఏదైనా జరుగుతుందనే భయంతో ఆస్పత్రికి తీసుకెళ్లి అన్ని రకాల వైద్య పరీక్షలను చేయించింది బాలుడి తల్లి. ఇక వైద్యులు బాలుడికి టెస్టులు నిర్వహించి ఆరోగ్యంగానే ఉన్నాడని చెప్పారు. కాగా.. బాలుడు కొరికిన పాము విషపూరితమైనది కాదనీ.. అందువల్ల బాలుడికి ఏమీ కాలేదని వెల్లడించారు.

Next Story