ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్.. 60,000 మందికి ఉపాధి

Biggest iPhone manufacturing unit to come up near Bengaluru. యాపిల్ ఐఫోన్ తయారీ యూనిట్‌ను బెంగళూరులోని హోసూర్‌లో త్వరలో ప్రారంభం అవుతుంది.

By Medi Samrat
Published on : 16 Nov 2022 8:11 PM IST

ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్.. 60,000 మందికి ఉపాధి

యాపిల్ ఐఫోన్ తయారీ యూనిట్‌ను బెంగళూరులోని హోసూర్‌లో త్వరలో ప్రారంభం అవుతుంది. ఈ విషయాన్ని టెలికాం, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్ ద్వారా 60,000 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. రాబోయే రెండేళ్లలో దేశంలో యాపిల్ సరఫరాదారు ఫాక్స్‌కాన్ తమ కార్యకలాపాలను నాలుగు రెట్లు విస్తరించే యోచనలో ఉంది. భారత్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వలన చాలా వరకూ ఖర్చులు తగ్గుతాయని పలు మొబైల్ ఫోన్ సంస్థలు భావిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చైనాలో తయారీని కాదని.. భారత్ కు వచ్చేస్తున్నాయి పలు కంపెనీలు. భారతదేశంలో ఐఫోన్ తయారవుతూ ఉండగా.. ఇప్పటికే బెంగళూరులో నెలకొల్పనున్న ఐఫోన్‌ల తయారీలో రాంచీ, హజారీబాగ్‌ల సమీప ప్రాంతాలకు చెందిన దాదాపు ఆరు వేల మంది గిరిజన మహిళలు శిక్షణ పొందారని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బెంగళూరులోని హోసూర్‌లో ఉన్న టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌ నుంచి అవుట్‌సోర్స్ ద్వారా యాపిలో ఐఫోన్ ఎన్‌క్లోజర్‌లను తయారు చేస్తోంది. దేశంలోని యాపిల్ ఐఫోన్‌లను ఫాక్స్‌కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్‌ వంటి ఎలక్ట్రానిక్‌ కంపెనీలు కూడా తయారు చేస్తున్నాయి. ఫాక్స్‌కాన్ ఇండియాలో తొలిసారిగా 2019లో ప్లాంట్‌ను ప్రారంభించింది. రెండేళ్లలో బెంగళూరులో స్థాపించనున్న ఐఫోన్ తయారీ యూనిట్‌లో 53,000ల మందికి ఉపాధి కల్పించనుంది ఫాక్స్‌కాన్ సంస్థ.

Next Story