గుజరాత్‌లో బీజేపీ ప్రభంజనం.. వరుసగా ఏడోసారి..
Bharatiya Janata Party once again won the Gujarat assembly election. రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరోసారి ఘన విజయం సాధించింది.
By అంజి Published on 8 Dec 2022 9:03 PM ISTరాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరోసారి ఘన విజయం సాధించింది. వరుసగా ఏడోసారి గెలుపొంది 37 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. గుజరాత్‌లో మొత్తం 186 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 156 స్థానాల్లో గెలిచి సరికొత్త రికార్డును సృష్టించింది. 1995లో 121, 1998లో 117, 2002లో 127, 2007లో 177, 2012లో 115, 2017లో 99 స్థానాలు గెలిచి విజయం సాధించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 17, ఆమ్ ఆద్మీ పార్టీ 5, ఇతరులు నాలుగు స్థానాలను గెలుచుకున్నారు.
గుజరాత్‌లో బీజేపీ గెలుపుపై ప్రధాని మోదీ స్పందించారు. తమ కంచుకోటలో వరుసగా ఏడోసారి విక్టరీ సాధించినందుకు పార్టీ కార్యకర్తలు ధన్యవాదాలు చెప్పారు. తమ పార్టీకి అసలైన బలం కార్యకర్తలేనని అన్నారు. వారి అసాధారణ కృషి లేకుండా ఈ చారిత్రాత్మక విజయం ఎప్పటికీ సాధ్యం కాదంటూ మోదీ ట్వీట్ చేశారు. ఈ నెల 12న మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి భూపేంద్ర పటేల్ గుజరాత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సి.ఆర్ పాటిల్ తెలిపారు.
ఎగ్జిట్ పోల్స్ బిజెపి వరుసగా ఏడవసారి సునాయాసంగా గెలుస్తుందని అంచనా వేసింది. గుజరాత్‌లో రెండు విడుతల్లో పోలింగ్ జరిగింది. మొదటి దశ 89 స్థానాలకు డిసెంబర్ 1న, మిగిలిన 93 స్థానాలకు డిసెంబర్ 5న పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో 64.33 శాతం ఓటింగ్ నమోదైంది, ఇది 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే దాదాపు 4 శాతం తక్కువ. 4.9 కోట్ల మంది నమోదైన ఓటర్లలో, 2022 ఎన్నికల్లో కేవలం 3.16 కోట్ల మంది మాత్రమే ఓటు వేశారు. 1995 నుంచి దశాబ్దాలుగా గుజరాత్ బీజేపీకి కంచుకోటగా ఉంది.
ప్రస్తుతం దేశంలో అత్యంత బలమైన రాజకీయ శక్తి తామేనని, భారతదేశంలోని అత్యంత ఆధిపత్య రాజకీయ పార్టీలలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోతుందని బీజేపీ మరోసారి నిరూపించుకుంది. పార్టీ గుజరాత్‌లో రాబోయే ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తే, అది ఒక రాష్ట్రాన్ని వరుసగా ఏడు పర్యాయాలు పాలించిన వామపక్షాల రికార్డును సమం చేస్తుంది (పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలు ఏడుసార్లు అధికారం చేపట్టాయి). గుజరాత్ విజయం మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ యొక్క ఇమేజ్, ప్రజాదరణను పటిష్టం చేసింది.
2023లో దాదాపు 10 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఈశాన్య భాగం (బీజేపీ ఆధిపత్యం ఉన్న ప్రాంతం)తో పాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాలు (ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్) ఉండే అవకాశం ఉంది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.