రెండో రోజు ఎంతో ఉత్సాహంగా సాగిన రాహుల్ యాత్ర
Bharat Jodo Yatra in TS On day 2, yatris talk labour rights; Bilkis Bano posters spotted. తెలంగాణ రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర రెండో రోజు ఫుల్ ఎనర్జీతో సాగింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Oct 2022 9:31 PM ISTతెలంగాణ రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర రెండో రోజు ఫుల్ ఎనర్జీతో సాగింది. మరికల్ నుంచి ఓబులాయిపల్లె వరకు.. నారాయణపేట నుంచి మహబూబ్‌నగర్ వరకు సాగిన కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో వేలాది మంది పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరాగా, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎంతో ఉత్సాహంగా సాగింది. ఇక నడిచి అలసిపోయిన చాలామంది తమ కార్లలో యాత్రను అనుసరించడంతో 'కారు యాత్ర' కూడా సాగింది. రాహుల్ గాంధీని కలవాలని, రాష్ట్ర, కేంద్ర సమస్యలపై చర్చించాలని పలువురు కాంగ్రెస్ పార్టీ విభాగాన్ని కోరారు. తెలంగాణ పార్టీ సీనియర్ నేతలు ఆయనతో చర్చించారు.
కార్మిక హక్కుల కోసం పోరాటం :
రెండో రోజు యాత్రలో తెలంగాణ రాష్ట్ర సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎం ఖలీల్, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.యాదగిరి మహబూబ్‌నగర్ జిల్లాలో వలస కార్మికుల కష్టాలను రాహుల్ గాంధీకి వివరించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వారికి ఎటువంటి ఆదరణ లభించలేదని లేదన్నారు. వలసలు ఆగిపోయాయని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదనలు బూటకమని అన్నారు. చాలా మంది వలస కార్మికులు ప్రమాదాల్లో చనిపోతున్నారని, వారి కుటుంబాలకు పరిహారం అందడం లేదని నాయకులు రాహుల్ గాంధీకి తెలిపారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే అనేక మంది తాపీ మేస్త్రీలు తరచూ అనారోగ్యం పాలవుతున్నారని, వారికి సరైన వైద్యం అందడం లేదన్నారు. జిల్లా కలెక్టర్లు, కార్మిక శాఖలకు విన్నవించినా ఫలితం లేదని.. నిర్మాణ రంగంలో మరణిస్తున్న అనేక మందికి పరిహారం అందడం లేదని వారు ఆరోపించారు.
ఎనిమిది గంటల పనిదినాన్ని రద్దు చేసి 12 గంటల పనిదినాన్ని ప్రవేశపెట్టాలని పి.యాదగిరి రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, 29 కార్మిక చట్టాలను రద్దు చేయాలన్నారు. ప్రతినిధి బృందం చెప్పిన సమస్యలను రాహుల్ గాంధీ విన్నారని.. వాటిపై పోరాటం చేస్తామని హామీ ఇచ్చారని తెలుస్తోంది.
బిల్కిస్ బానోకు న్యాయం చేయాలని కోరుతూ పోస్టర్లు
తెలంగాణలో భారత్ జోడో యాత్ర సందర్భంగా బిల్కిస్ బానో కేసు గురించి కార్మిక, బాలల హక్కుల కార్యకర్త వర్షా భార్గవి రూపొందించిన పోస్టర్లను యాత్రలో పాల్గొన్న పలువురికి అందించారు. స్వరాజ్ ఇండియాకు చెందిన పార్వతి సాహు "Her Fight is Our Fight", "Justice for Bilkis Bano" అని రాసి ఉన్న పోస్టర్‌లను పట్టుకుని నడిచారు. ఇది రాహుల్ గాంధీ దృష్టిని ఆకర్షించింది, రాహుల్ ఆమెను పిలిచి ఆమెతో పాటు పోస్టర్‌ను పట్టుకున్నారు. బిల్కిస్ బానో అంశాన్ని హైలైట్ చేసేందుకు వర్షా భార్గవి ఈ పోస్టర్లను డిజైన్ చేశారు. ఆమె సంతకాల సేకరణను కూడా చేపట్టారు. మధ్యాహ్నం విరామ సమయంలో, చాలా మంది పిటిషన్‌లపై సంతకం చేశారు. వర్ష "జస్టిస్ ఫర్ బిల్కిస్ బానో" అని ఉన్న స్టిక్కర్‌లను కూడా డిజైన్ చేసింది. చాలా మంది తమ షర్టులు, దుస్తులపై స్టిక్కర్‌లను అతికించుకున్నారు.