నాసల్ టీకా.. డోసుకు ధర ఎంతంటే..?
Bharat Bios nasal Covid vaccine to cost Rs 800/dose.నాసల్ టీకాకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అనుమతి
By తోట వంశీ కుమార్ Published on 27 Dec 2022 9:14 AM GMTనాసల్ టీకాకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. 18 ఏళ్లు పై బడిన వారంతా నాసల్ టీకాను బూస్టర్ డోసుగా తీసుకునేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. అయితే.. ఈ టీకా ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుంది..? ఉచితంగా ఇస్తారా..? లేక ప్రైవేటు ఆస్పత్రుల్లోనే దొరుకుతుందా..? ఈ టీకా ధర ఎంత ఉంటుంది వంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి.
జనవరి నాలుగో వారంలో మార్కెట్‌లో టీకా అందులోకి రానున్నట్లు భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది. సింగిల్ డోస్ టీకా ధర రూ.800 గా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీనికి అదనంగా 5 శాతం జీఎస్టీ, వ్యాక్సిన్ ఇచ్చినందుకు చార్జీ వసూలు చేయనున్నారు. మొత్తంగా రూ.1000 కి ప్రైవేటులో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో సేకరించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం రూ.320కే ఇవ్వనున్నట్లు బయోటెక్ తెలిపింది.
కోవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ రెండు డోసులు తీకున్న వారు నాసిల్ టీకాను బూస్టర్ డోసుగా తీసుకోవచ్చు. ప్రస్తుతానికి ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రమే ఈ టీకా అందుబాటులో ఉంటుంది. జాతీయ కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాల్లో దీన్ని ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. బీబీవీ154గా పిలిచే ఈ నాసిల్ టీకా ఇంకొవాక్ బ్రాండ్ పేరుతో మార్కెట్‌లో దొరుకుతుంది. కొవిడ్ పై పోరులో ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ప్రమోగ పరీక్షల్లో తేలినట్లు భారత్ బయోటెక్ తెలిపింది.