బెంగళూరులో 'జాంబీ డ్రగ్'కలకలం..అసలు నిజం బయటపెట్టిన పోలీసులు!

బెంగళూరులో "జాంబీ డ్రగ్స్" కలకలం రేపిన వీడియో వెనుక ఉన్న అసలు నిజాన్ని పోలీసులు ఛేదించారు

By -  Knakam Karthik
Published on : 10 April 2026 9:00 PM IST

National News, Bengaluru, ZombieDrug, FakeNews, SocialMediaViral, KarnatakaPolice

బెంగళూరులో 'జాంబీ డ్రగ్'కలకలం..అసలు నిజం బయటపెట్టిన పోలీసులు!

బెంగళూరులో "జాంబీ డ్రగ్స్" కలకలం రేపిన వీడియో వెనుక ఉన్న అసలు నిజాన్ని పోలీసులు ఛేదించారు. నగరంలో జాంబీ డ్రగ్స్ వాడుతున్నారంటూ తప్పుడు వీడియో పోస్ట్ చేసిన హేమంత్ కుమార్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వీడియోలో వింతగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని కూడా గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించగా, అతని శరీరంలో ఎలాంటి మాదకద్రవ్యాలు లేవని తేలింది.

హర్యానా లేదా పంజాబ్‌కు చెందిన ఆ లారీ డ్రైవర్ అనారోగ్యం కారణంగా మందులు వేసుకుని, అదే సమయంలో మద్యం సేవించడం వల్ల అలా వింతగా ప్రవర్తించాడని హోం మంత్రి జి. పరమేశ్వర స్పష్టం చేశారు. కేవలం సోషల్ మీడియాలో ప్రచారం కోసమే నిందితుడు ఈ వీడియోను చిత్రీకరించి భయాందోళనలు సృష్టించాడని, బెంగళూరులో అలాంటి డ్రగ్స్ ఏవీ లేవని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దునియా విజయ్ వంటి సెలబ్రిటీలు కూడా ఈ వీడియోపై స్పందించడంతో ఇది మరింత వైరల్ అయ్యింది. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.

Next Story