అసభ్యంగా తాకిన ర్యాపిడో డ్రైవర్.. బైక్ నుండి దూకేసిన మహిళ
Bengaluru woman jumps off moving Rapido bike after driver gropes her. బెంగళూర్ లో 30 ఏళ్ల మహిళపై ర్యాపిడో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
By M.S.R Published on 26 April 2023 5:26 PM ISTబెంగళూర్ లో 30 ఏళ్ల మహిళపై ర్యాపిడో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళ ఆ డ్రైవర్ నుంచి తప్పించుకునేందుకు బైక్ పై నుంచి దూకేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 21 రాత్రి, ఓ మహిళ ఇందిరా నగర్ నుంచి ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంది. రాత్రి 11.10 గంటలకు ఆమెను తీసుకెళ్లడానికి ర్యాపిడో బైక్ డ్రైవర్ వచ్చాడు. ఆ సమయంతో ఓటీపీని చూసే క్రమంతో తన మొబైల్ ఫోన్ లాక్కున్నట్లుగా మహిళ ఆరోపించింది. ఆ తర్వాత తప్పుడు మార్గంలో బైక్ ను పోనిచ్చాడని.. అసభ్యంగా తాకుతూ.. లైంగికంగా వేధించే ప్రయత్నం చేశాడని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. చివరకు తనను తాను రక్షించుకోవడానికి కదులుతున్న మోటార్‌సైకిల్‌పై నుంచి దూకాల్సి వచ్చిందని మహిళ పోలీసులకు తెలిపింది.
#WATCH| Bengaluru, Karnataka: Woman jumps off a moving motorbike after the rapido driver allegedly tried to grope her & snatched her phone
— ANI (@ANI) April 26, 2023
On 21st April, woman booked a bike to Indiranagar, driver allegedly took her phone on pretext of checking OTP & started driving towards… pic.twitter.com/bPvdoILMQ2
డీసీపీ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. మా డివిజన్‌లో ఇలాంటిది ఇదే మొదటి కేసు. మహిళలు, పౌరుల భద్రత గురించి చర్చించడానికి మా కమిషనర్ అన్ని క్యాబ్ అగ్రిగేటర్లు, బైక్ టాక్సీ సేవలు, ఫుడ్ డెలివరీ భాగస్వాములను పిలిచారు. భారతీయ శిక్షాస్మృతి లోని పలు సెక్షన్స్ కింద మేము కేసు నమోదు చేసామని తెలిపారు. కంపెనీలు ఎవరినైనా నియమించుకున్నప్పుడు NOC తప్పనిసరిగా తీసుకోవాలి. అతను స్థానికుడు కాదని.. హైదరాబాద్‌కు చెందిన ఆ వ్యక్తి గత ఐదేళ్లుగా ఇక్కడే ఉంటున్నాడని పోలీసులు నిందితుడి గురించి చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి దీపక్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.