మంత్రిపై బాంబు దాడి.. ప‌రిస్థితి విష‌యం.. కోల్‌క‌తాకు అమిత్ షా

Bengal minister Jakir hossain injured after assailants hurl crude bombs.ప‌శ్చిమ‌ బెంగాల్ కార్మికశాఖా మంత్రి జాకీర్ హుస్సేన్ పై బాంబు దాడి జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Feb 2021 3:33 AM GMT
Bengal minister Jakir Hossain injured

ప‌శ్చిమ‌ బెంగాల్ కార్మికశాఖా మంత్రి జాకీర్ హుస్సేన్ పై బాంబు దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో మంత్రి తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు. బుధ‌వారం రాత్రి కోల్ క‌త్తా వెళ్లేందుకు ముర్షీదాబాద్ జిల్లాలోని రంగనాథ్ గంజ్ రైల్వే స్టేషన్ లో రెండో నెంబర్ ప్లాట్ ఫామ్ పై నిలబడి ఉండగా ఆయనపై దాడి జరిగింది. ఈ దాడి జరిగిన వెంటనే ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బాంబు పేలుళ్లతో రైల్వే స్టేషన్ దద్దరిల్లింది. ప్రయాణికులు, రైల్వే సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మంత్రిని జంగీపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మంత్రితోపాటు మరో ఇద్దరు గాయపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇదిలా ఉంటె.. ఉత్తర కోల్ కతాలో బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు శివాజీ సింగ్ రాయ్, సుబెందు అధికారి, శంకుదేవ్ పాండాలపై కొందరు దుండగులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ముగ్గురు గాయపడ్డారు. బెంగాల్ లో బీజేపీ నేతలపై దాడులు జరుగుతుండటంతో హుటాహుటిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అర్ధరాత్రి కోల్ కతా కు వెళ్లారు. అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.


మరికొద్ది రోజుల్లో ప‌శ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో అటు అధికార తృణ‌ముల్ కాంగ్రెస్‌, ఇటు ప్ర‌తిప‌క్ష భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) లు గెలుపు కోసం ఎత్తుకు పెఎత్తులు వేస్తున్నాయి. ఇక తృణ‌ముల్ కాంగ్రెస్ నుంచి ఇటీవ‌ల అనేక మంది నాయ‌కులు ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి బీజేపీలో చేరుకున్నారు. గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన సమయంలో ఆయన కాన్వాయ్ పై కొంతమంది దాడికి పాల్పడిన సంగ‌తి తెలిసిందే.




Next Story