మందుబాబులకు శుభవార్త.. బీర్ పై ఏకంగా రూ.30తగ్గింపు
Beer to get cheaper in Rajasthan.రాజస్థాన్‌లో తాజాగా ఒక్కో బీరుపై ఏకంగా రూ.30 నుంచి రూ.35తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
By తోట వంశీ కుమార్ Published on 1 April 2021 3:22 PM IST
మందుబాబులకు నిజంగా ఇది శుభవార్త అనే చెప్పాలి. మండుటెండల్లో చల్లటి వార్త ఇది. మిగతా రోజుల్లో పోలిస్తే ఎండాకాలంలో బీర్ల అమ్మాకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎండలకు చల్లటి బీర్ వేస్తే బాగుంటుందని మందుబాబులు అంటుంటారు. అయితే.. ఒకప్పుడు రూ.60 నుంచి రూ.70 ఉన్న బీర్ల ధరలు ప్రస్తుతం రూ.100 నుంచి రూ.180 మధ్య ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో అక్కడ లభించే బ్రాండ్లను బట్టి రేట్లు ఉన్నాయి. అయితే.. తాజాగా ఒక్కో బీరుపై ఏకంగా రూ.30 నుంచి రూ.35తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే.. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి.. రాజస్థాన్‌లో.
కరోనా కాలంలో రాజస్థాన్‌లో బీర్లు తాగేందుకు మందుబాబులు ఎక్కువగా ఆసక్తి చూపలేదని రాజస్థాన్ ప్రభుత్వ పరిశీలనలో తేలింది. ఎందుకంటే బీర్ల రేట్లపై అదనపు ఎక్సైజ్ సుంకం, కొవిడ్ సర్‌చార్జ్ పెంచడంతో పెద్దగా వాటిపై మొగ్గు చూపలేదు. ఈ క్రమంలో కొత్త ఎక్సైజ్ పాలసీలో అదనపు ఎక్సైజ్ సుంకం, కొవిడ్ సర్ చార్జ్ ను తగ్గించారు. 2019-20 ఏడాదిలో 2 కోట్ల 65 లక్షల బీర్ల కేసులు అమ్ముడు పోయాయి. 2020-21లో ఆ సంఖ్య ఒక కోటి 60 లక్షలకు తగ్గింది. కేవలం 95 లక్షల బీర్ల కేసులు మాత్రమే అమ్ముడు పోయాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది. ఈ నేపథ్యంలో బీర్ల అమ్మకాలను పెంచి, ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకునే విధంగా వాటి ఎమ్మార్పీ ధరలపై అదనపు ఎక్సైజ్ సుంకం, కొవిడ్ సర్‌చార్జ్ ను ఎత్తేశారు. కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం..బీర్ల ధరలు రూ. 30 నుంచి రూ. 35 వరకు తగ్గనున్నాయి. బీర్ బ్రాండ్ ను బట్టి ధరలు మారనున్నాయి.