'ఆయ‌న‌ నా తండ్రి లాంటి వారు'.. డేటింగ్ రూమ‌ర్ల‌కు చెక్ పెట్టిన మోహిని డే..!

సంగీత ద‌ర్శ‌కుడు AR రెహమాన్ పేరు ప్ర‌స్తుతం బాగా వినిపిస్తోంది. గత వారం రెహమాన్ త‌న‌ భార్య సైరా బానుకు విడాకులు ఇవ్వ‌డ‌మే అందుకు కారణం.

By Kalasani Durgapraveen  Published on  26 Nov 2024 2:57 PM IST
ఆయ‌న‌ నా తండ్రి లాంటి వారు.. డేటింగ్ రూమ‌ర్ల‌కు చెక్ పెట్టిన మోహిని డే..!

సంగీత ద‌ర్శ‌కుడు AR రెహమాన్ పేరు ప్ర‌స్తుతం బాగా వినిపిస్తోంది. గత వారం రెహమాన్ త‌న‌ భార్య సైరా బానుకు విడాకులు ఇవ్వ‌డ‌మే అందుకు కారణం. పెళ్లయిన చాలా కాలం తర్వాత రెహమాన్, సైరా విడిపోయారు. AR రెహమాన్ బృందంలో ఒకప్పుడు బాసిస్ట్‌గా పనిచేసిన మోహిని డేతో ముడిపెడుతూ రూమ‌ర్లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ రహస్యంగా డేటింగ్ చేసే అవకాశం ఉందని ఓ వర్గం నెటిజన్లు చెప్పడం మొదలుపెట్టారు. ఈ విషయంపై మోహిని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి మోహిని తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తాజా పోస్ట్‌ను పంచుకున్నారు. దీనిలో డేటింగ్ వార్తలు కేవలం పుకార్ల‌ని వెల్ల‌డించింది. నా గురించి, ఏఆర్ రెహమాన్ గురించి వస్తున్న వార్తలు నిరాధారమైనవి.. నమ్మశ‌క్యంగానివి.. నా జీవితంలో చాలా మందిని నా రోల్ మోడల్స్‌గా, తండ్రిగా భావించాను. వారిలో ఏఆర్ రెహమాన్ ఒకరు. నేను ఎనిమిదేళ్ల‌ వయస్సు.. నా చిన్ననాటి రోజుల నుండి ఆయ‌న‌తో కలిసి పనిచేశాను. దయచేసి తప్పుడు ప్ర‌చారాలు చేయడం మానేసి.. మా గోప్యత పట్ల కొంత గౌరవం చూపండని కోరింది.

ఈ విధంగా రూమ‌ర్ల‌ను మోహిని ఖండించారు. కొన్ని షోలు చేసిన తర్వాత మోహిని.. రెహ‌మాన్‌ టీమ్‌ను విడిచిపెట్టంది. 6 రోజుల క్రితం AR రెహమాన్ తన విడాకులను సోషల్ మీడియాలో అధికారికంగా ధృవీకరించారు. పెళ్లయిన 29 ఏళ్ల తర్వాత రెహ్మాన్, సైరాల బంధం శాశ్వతంగా తెగిపోయింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సహా ముగ్గురు సంతానం.

Next Story