కర్ణాటక 20వ ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో గవర్నర్ థావర్ చాంద్ గెహ్లోత్.. బొమ్మైతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముందు మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కలిసి ఆయన రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. సోమవారం యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
బసవరాజ్ బొమ్మై రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడు. జనతాదళ్ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బొమ్మై 2008లో బీజేపీలో చేరారు. 1998, 2004లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత షిగ్గావ్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యడియూరప్పకు ఎస్ఆర్ బొమ్మై అత్యంత సన్నిహితుడు నమ్మకస్తుడు.
శాసనసభాపక్ష సమావేశంలో ఆయన పేరును యడియూరప్ప ప్రతిపాదించగా మాజీ ఉపముఖ్యమంత్రి గోవింద కారజోళ ఆమోదం తెలిపారు. మంగళవారం వరకు దాదాపు పది మంది ఆశావహుల పేర్లు పరిశీలనలో ఉన్నా చివరకు బొమ్మై పేరును అధిష్టానం ఖారారు చేసింది. ఇదే సందర్భంగా ముగ్గురు ఉపముఖ్యమంత్రులను నియమించారు. ఆర్.అశోక్, బి.శ్రీరాములు, గోవింద కారజోళ ఈ పదవులకు ఎంపికయ్యారు.