ఇటీవల కాలంలో విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. బంగ్లాదేశ్‌కు చెందిన సలామ్ ఎయిర్ విమానం చిట్టగాంగ్ నుంచి ఒమన్ రాజధాని మస్కట్‌కు బయలు దేరగా.. విమానంలోని కార్గో ఏరియాలో పొగలు రావడాన్ని ఫైలట్ గుర్తించాడు. అత్యవసర ల్యాండింగ్ కోసం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) అనుమతి కోరాడు.
వెంటనే అప్రమత్తమైన అధికారులు మహారాష్ట్రలోని నాగ్‌పూర్ విమానాశ్రమంలో ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు. ఆ సమయంలో విమానంలో 200 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో నాగ్‌పూర్ విమానాశ్రమంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. ఫైరింజన్లు, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. అయితే.. విమానం సురక్షితంగా ల్యాండింగ్ కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
బంగ్లాదేశ్‌కు చెందిన ఓ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడం ఇది రెండోసారి. గతంలో బైమన్ బంగ్లాకు చెందిన విమాన ఫైలట్‌కు గుండెపోటు రావడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన 2011లో జరిగింది.