బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్..అసోసియేషన్ సంచలన నిర్ణయం

వాణిజ్య ఎల్‌పిజి (LPG) సిలిండర్ల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడటంతో బెంగళూరు హోటల్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది

By -  Knakam Karthik
Published on : 9 March 2026 9:30 PM IST

Karnataka, Bangalore Hotels, Gas Supply Cut, LPGS hortage, Hotel Association

బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్..అసోసియేషన్ సంచలన నిర్ణయం

బెంగళూరు: వాణిజ్య ఎల్‌పిజి (LPG) సిలిండర్ల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడటంతో బెంగళూరు హోటల్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. మంగళవారం (మార్చి 10) నుండి నగరం అంతటా హోటళ్లను నిరవధికంగా మూసివేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు సుమారు 70 రోజుల పాటు వాణిజ్య సిలిండర్ల సరఫరాను నిలిపివేయడంతో, వంటశాలలను నిర్వహించడం సాధ్యం కావడం లేదని అసోసియేషన్ స్పష్టం చేసింది.

గతంలో 70 రోజుల వరకు ఎటువంటి అంతరాయం ఉండదని హామీ ఇచ్చిన కంపెనీలు, ఇప్పుడు అకస్మాత్తుగా సరఫరా ఆపివేయడం హోటల్ పరిశ్రమను కోలుకోలేని దెబ్బ తీసిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సంక్షోభం వల్ల హోటళ్లపై ఆధారపడే సామాన్యులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆందోళన వ్యక్తం చేస్తూ, కేంద్ర మంత్రులు వెంటనే జోక్యం చేసుకుని వాణిజ్య గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. తదుపరి నోటీసు ఇచ్చే వరకు ఈ బంద్ కొనసాగుతుందని అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేశారు.

Next Story