కర్ణాటకలో ఓ అసాధారణ వైద్య కేసు చోటు చేసుకుంది. బాగల్‌కోట్ జిల్లాలో మొత్తం 13 చేతి వేళ్లు, 12 కాలి వేళ్లతో ఒక మగబిడ్డ జన్మించాడు. దీనిని దైవానుగ్రహంగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. పాప కుడి చేతికి ఆరు వేళ్లు, ఎడమ చేతిలో ఏడు వేళ్లు అలాగే ఒక్కో పాదానికి ఆరు వేళ్లు ఉన్నాయి. శిశువు, శిశువు తల్లి అయిన 35 ఏళ్ల భారతి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం.
తనకు ఆరోగ్యంగా ఉన్న మగబిడ్డ పుట్టాడనే వార్త పట్ల భారతి హర్షం వ్యక్తం చేశారు. తండ్రి గురప్ప కోనూరు మగబిడ్డ రాకతో సంతోషనం వ్యక్తం చేశారు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ పరిస్థితిని పాలిడాక్టిలీ అని పిలుస్తారు, ఇది అరుదైన జన్యు క్రమరాహిత్యం, దీని ఫలితంగా శిశువుల్లో అదనపు వేళ్లు, కాలి వేళ్లు ఏర్పడతాయి.