బాబా సిద్ధిఖీ కుమారుడికి బెదిరింపులు.. సల్మాన్‌కు కూడా..

ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిక్‌కు సోమవారం నాడు హత్య బెదిరింపులు వచ్చాయి.

By Kalasani Durgapraveen  Published on  29 Oct 2024 12:11 PM IST
బాబా సిద్ధిఖీ కుమారుడికి బెదిరింపులు.. సల్మాన్‌కు కూడా..

ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిక్‌కు సోమవారం నాడు హత్య బెదిరింపులు వచ్చాయి. నిందితులు సల్మాన్ ఖాన్‌ను కూడా బెదిరించారు. ఈ కేసులో నోయిడాలోని సెక్టార్ 39 నుండి 20 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. ముంబై పోలీసులు మహ్మద్ తయ్యబ్‌ను అరెస్టు చేశారు. అత‌డిని ట్రాన్సిట్ రిమాండ్‌కు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. జీషన్ పబ్లిక్ రిలేషన్స్ కార్యాలయానికి ఈ బెదిరింపు కాల్ వచ్చింది. ఆ వ్య‌క్తి జీషన్, సల్మాన్ ఖాన్‌లను బెదిరించి డబ్బులు డిమాండ్ చేశాడు.

బెదిరింపు వచ్చిన తర్వాత జీషన్ సిద్ధిఖీ కార్యాలయం నుంచి పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. ఆ త‌ర్వాత‌ ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. మంగళవారం పోలీసులు నిందితుడు మహ్మద్ తయ్యబ్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. విజయదశమి (అక్టోబర్ 12) సాయంత్రం బాబా సిద్ధిఖీని ముగ్గురు దుండగులు హత్య చేశారు. దాడి చేసిన వ్యక్తులు జీషన్‌పై అతని కార్యాలయం వెలుపల దాడి చేసిన‌ట్లుగా కూడా క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. మీడియా కథనాల ప్రకారం.. జీషన్‌కు ఫోన్ చేసిన నిందితులు సల్మాన్ ఖాన్‌ను కూడా బెదిరించినట్లు తెలిసింది.


Next Story